ఓ మహిళకు భర్త, అత్తా మామలు కలిసి బలవంతంగా విషం తాగించారు. హతమార్చేందుకు ప్రయత్నించారు.
భర్త, అత్తా మామల అఘాయిత్యం
చికిత్స పొందుతున్న బాధితురాలు
రాయదుర్గం రూరల్ : ఓ మహిళకు భర్త, అత్తా మామలు కలిసి బలవంతంగా విషం తాగించారు. హతమార్చేందుకు ప్రయత్నించారు. గుమ్మఘట్ట మండలం జే.వెంకటాంపల్లిలో గురువారం జరిగిన ఈ సంఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జే.వెంకటాంపల్లికి చెందిన రంగారెడ్డి, అనంతమ్మ కుమారుడు లక్ష్మిరెడ్డి, రాయదుర్గం మండలం రేకులకుంట గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి, లీలావతమ్మ కుమార్తె బిందుశ్రీకి ఐదేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి ఓ కూతురు. బిందుశ్రీని భర్త, అత్తామామలు నిత్యం వేధించేవారు.పలుసార్లు చిత్రహింసలకు గురిచేశారు. ఇంట్లో ఉండరాదంటూ మూడు రోజుల క్రితం బయటకు నెట్టారు. గురువారం మధ్యాహ్నం అత్తామామలు తలో చేయి పట్టుకోగా.. భర్త బలవంతంగా పురుగుల మందు తాపించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను స్థానికులు రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతోంది.