సాక్షి, కడప :
జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలు సాకుగా చూపుతూ వాయిదా వేసిన 21 సొసైటీ ఎన్నికల డెరైక్టర్ స్థానాల బరిలో 385 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ దశలో 12 సొసైటీల ఎన్నికలు నిలిచిపోగా, ప్రస్తుతం వాటిలో డెరైక్టర్ స్ధానాలకు 133 మంది పోటీ పడుతున్నారు. 93 డెరైక్టర్ స్ధానాలు ఏకగ్రీవం కావడం విశేషం. పోలింగ్ ప్రక్రియ దశలో ఆగిపోయిన 8 సొసైటీలకు 252 మంది అభ్యర్ధులు పోటిలో నిలిచారు. ఇందులో 8 డెరైక్టర్ స్థానాలు మాత్రమే ఏక గ్రీవమయ్యాయి. ఈ స్ధానాలలో వైసీపీ అనుకూల అభ్యర్ధులు అధిక్యం ప్రదర్శించే అవకాశం ఉండటంతో అధికార పార్టీ అప్పట్లో ఈ ఎన్నికలను వాయిదా వేయించింది. టంగుటూరు సొసైటీకి సంబంధించి అత్యధికంగా 54 నామినేషన్లు రావడం విశేషం.
ఇందులోనే 12వ డెరైక్టర్ స్థానానికి 8మంది బరిలో నిలవడం విశేషంపోలింగ్ దశలో ఆగిన సొసైటీ బరిలో అభ్యర్ధులు వీరే గతంలో నాగిరెడ్డిపల్లె సొసైటీలో ఒక డెరైక్టర్ స్థానం ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 డెరైక్టర్ స్థానాలకు 34 మంది బరిలో ఉన్నారు. కె.అగ్రహారం సొసైటీకి సంబంధించి ఒక డెరైక్టర్ ఏకగ్రీవం కాగా, 25 మంది పోటీలో నిలిచారు. యల్లటూరు సొసైటీకి 34 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వల్లూరులో 10వ డెరైక్టర్ స్థానానికి నామినేషన్ దాఖలు కాలేదు. మిగతా 12 స్థానాలకు 26 మంది రంగంలో ఉన్నారు. మన్నూరు సొసైటీకి రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలలో 22 మంది పోటీపడుతున్నారు. అల్లాడుపల్లె సొసైటీలో నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు 28 మంది పోటీకి సిద్ధపడుతున్నారు. టంగుటూరుసొసైటీకి సంబంధించి 13 డెరైక్టర్ స్థానాలకు 54 మంది పోటీలో ఉండడం విశేషం.
నామినేషన్ల దశలో నిలిచిన సొసైటీ బరిలో...
బి.కోడూరులో మూడు స్థానాలలో ఆరుగురు,
చెన్నకేశంపల్లెలో నాలుగు స్థానాలకు 10 మంది, పెనగలూరులో ఏడు స్థానాలకు 14 మంది, వీరబల్లిలో 13 స్థానాలకు 27 మంది, కొలిమివాండ్లపల్లెలో మూడు స్థానాలకు 6 మంది, మట్లిలో 13 స్థానాలకు 27 మంది, దిగువగొట్టివీడులో ఎనిమిది స్థానాలకు 18 మంది, నందలూరులో 12 స్థానాలకు 25 మంది పోటీలో ఉన్నారు. మొత్తానికి జిల్లాలో మరోసారి సహకార ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది.
పోటా పోటీ
Published Tue, Dec 31 2013 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement