భవిష్యత్తు ‘ఈ- లెర్నింగ్’దే | Future is only for E-learning | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు ‘ఈ- లెర్నింగ్’దే

Published Sun, Aug 18 2013 1:54 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

Future is only for E-learning

గాంధీ ఆస్పత్రి, న్యూస్‌లైన్: వైద్య విద్యార్థులో ఆసక్తిని కలిగించి, విద్యాప్రమాణాలు మరింత పెంపొందించేందుకు ఈ-లెర్నింగ్ ఎంతగానో దోహదపడుతుందని మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ (ఎంఈడీఆర్‌సీ) క్లినికల్ రీసెర్చ్ డీన్ డాక్టర్ అమిత్‌కిషోర్ అన్నారు. గాంధీ మెడికల్ కళాశాలలో శనివారం జరిగిన ఫ్రెషర్స్‌డే సందర్భంగా ‘ఈ లెర్నింగ్-ప్రాధ్యాన్యత’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రానున్న కాలంలో వైద్యవిద్యా బోధనారంగంలో ఈ-లెర్నింగ్ గణనీయమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఎంఈడీఆర్‌సీ డైరక్టర్ గురుమూర్తి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, అటానమీ హెచ్‌ఓడీ సీమామధన్, కేవీ సత్యనారాయణమూర్తి, రాజశేఖర్ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement