అప్పిచ్చిన పాపానికి హతమార్చారు
► సామూహిక అత్యాచారం.. ఆపై హత్య
► వీడిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ
► నిందితులను ఎస్పీ ఎదుట హాజరు
► పరిచిన కోసిగి పోలీసులు
కర్నూలు: ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళను సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ నెల 8న జిల్లాలోని పెద్దకడబూరు స్టేషన్‌లో నమోదైన గుర్తు తెలియని మహిళ హత్య కేసు పోలీసులు ఛేదించారు. ఘాతుకానికి పాల్పడిన పెద్దకడుబూరు గ్రామానికి చెందిన బోయ మెట్రు హనుమంతు, పింజరి పీరమ్మ, బోయ బనవాసి నాగేంద్ర, బోయ కోటేకంటి లక్ష్మన్న, బోయ మెట్రు వీరేష్‌లను అరెస్టు చేసి శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదోని డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన వృద్ధురాలు చిట్టెమ్మ(60) నిందితుడు బోయ హనుమంతుకు రూ.5 వేలు అప్పు ఇచ్చింది.
తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడంతో హతమార్చాలని హనుమంతు మిగతా నిందితులతో కలిసి పథకం వేశాడు. ఈనెల 8న హనుమంతు ప్రియురాలు పింజరి పీరమ్మ ద్వారా చిట్టెమ్మను నెమలికల్లు-పెద్దతుంబళం రోడ్డులోని తాటివనంలోకి రప్పించుకుని మూకుమ్మడిగా అత్యాచారం చేసి కత్తితో గొంతు కోశారు. వృద్ధురాలి తల, మొండెం వేరు చేసి గుండు గీశారు. కళ్లు, ముక్కు, చెవులు కోసేశారు. రవిక, చీరను కాల్చేశారు. జత వెండి కడియాలు, బంగారం కమ్మలు తీసెకెళ్లి ఆదోనిలోని ఓ దుకాణంలో విక్రయించారు. మృతురాలి కు టుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించి నేరానికి ఉపయోగించిన కత్తి, ఇతర వస్తువులను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల్లో కేసును ఛేదించినందుకు ఎస్పీ ఆకే రవికృష్ణ కోసిగి పోలీసులను అభినందించారు. కోసిగి సీఐ కంబగిరి రా ముడు, పెద్దకడుబూరు ఎస్‌ఐ నాగరాజు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.