నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీలపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం దాడులు నిర్వహించారు. గురువారం కోవూరు, పడుగుపాడు, నెల్లూరులో దాడులు చేసిన ఆయన పలు గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కోవూరులోని వెంకయ్యస్వామి భారత్ గ్యాస్ ఏజెన్సీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు దాడుల్లో తేలింది.
గురువారం సాక్షి దినపత్రికలో ‘ఏజెన్సీల ఇష్టారాజ్యం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జేసీ స్పందించారు. సిలిండర్ రూ.418కు విక్రయించాల్సిన ఏజెన్సీ నిర్వాహకుడు రూ.440కి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు జేసీ తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వెంకయ్యస్వామి భారత్‌గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు రూ.10వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. ఇకపై జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీలపై దాడులు ఉంటాయన్నారు.
గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు నిబంధలనమేరకు గ్యాస్ పంపిణీ చేయాలన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులకు గురిచేసినా సహించేందిలేదని హెచ్చరించారు. వినియోగదారులపై గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు అమర్యాదగా వ్యవహరించరాదన్నారు. ఎటువంటి ఫిర్యాదులు అందినా విచారణ చేపట్టి ఆయా ఏజెన్సీలను సీజ్‌చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఏఎస్‌ఓ శంకరన్ పాల్గొన్నారు.
గ్యాస్ ఏజెన్సీలపై జేసీ దాడులు
Published Fri, Sep 20 2013 4:02 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement