
పశ్చిమ గోదావరి,కామవరపుకోట: గీత కార్మికులు కల్లు గీసుకుని భౌతిక దూరం పాటిస్తూ చెట్టు వద్ద అమ్ముకోవచ్చని జీఓ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కామవరపుకోట గౌడ సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. మిడత రమేష్‌బాబు ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా తాటిచెట్టు పైకి సీఎం జగన్ చిత్రపటాన్ని తీసుకుని వెళ్లి వినూత్నంగా హర్షం వ్యక్తం చేశారు. గౌడ సంఘ ప్రతినిధులు పలివెల ప్రభాకర్, వేముల సాయి, బి.లక్ష్మణరావు, నూతి శ్రీను, పరసా మోహన్, నూతి నాగరాజు పాల్గొన్నారు.