geetha karmikulu
-
‘గీత కార్మికుల బీమా’పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బీమా నగదు వారం రోజుల్లో నేరుగా వారి ఖాతాలో జమచేయనున్నట్లు పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంగళవారం దీనికి సంబంధించి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లుగీత సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నప్పటికీ.. ఇది బాధితులకు అందడంలో ఆలస్యమౌతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత రేపే నీరా కేఫ్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో అధునాతన హంగులతో నిర్మించిన నీరాకేఫ్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ప్రారంభించనున్నారు. గౌడ కులస్థులకు ఉపాధి కల్పించడంతోపాటు తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతిసిద్ధమైన నీరాను అందించాలని నిర్ణయించింది. రూ.12.20 కోట్లతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో నీరా కేఫ్‌ను సుందరంగా నిర్మించింది. ఇదే స్ఫూర్తితో భువనగిరిలోని నందనం, రంగారెడ్డిలోని ముద్విన్, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్లగొండలోని సర్వేల్లో నాలుగు నీరా సేకరించే కేంద్రాల కోసం ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 319 మంది గీత కార్మికులను గుర్తించి, వారికి శిక్షణ ఇప్పించింది. -
గీతకార్మికులకు మోపెడ్లు
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల తరహాలో గీతకార్మికులకు కూడా మోపెడ్లు ఇచ్చే విషయమై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని, ఇందుకు అవసరమైన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. నీరాపాలసీలో భాగంగా నీరాకేఫ్ ప్రారంభోత్సవం, ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్, నీరా చిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుతోపాటు ఎక్సైజ్‌శాఖ పరిధిలోని పలు అంశాలపై మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గీతకార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎక్సైజ్ శాఖ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. వృత్తి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు గీతకార్మికులు చెట్లపై నుంచి కింద పడినప్పుడు సంభవించే శాశ్వత అంగవైకల్యానికి ఇచ్చే సర్టిఫికెట్ల జారీని సులభతరం చేయాలని, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ సర్జన్ ఈ సర్టిఫికెట్లు ఇచ్చేలా నిబంధనలు సవరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో మెడికల్ బోర్డు పేరిట ముగ్గురు డాక్టర్లు సంబంధిత సర్టిఫికెట్ ఇచ్చే ప్రక్రియలో భాగస్వాములయ్యేవారు. సాధారణ మరణాలకూ ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. 10 రోజుల్లో సీఎం చేతుల మీదుగా నీరాకేఫ్ ప్రారంభం ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గీతకార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం నీరాపాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో రూ.20 కోట్లతో నిర్మించిన నీరాకేఫ్‌ను సీఎం కేసీఆర్ పదిరోజుల్లో ప్రారంభించేందుకు వీలుగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వేల్, చారుకొండ, మునిపల్లెల్లో చిల్లింగ్ ప్లాంట్ల నిర్మాణపనులను శరవేగంగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆ శాఖ ఉన్నతాధికారులు అజయ్‌రావు, డేవిడ్ రవికాంత్, దత్తురాజ్ గౌడ్, చంద్రయ్య, సత్యనారాయణ, రవీందర్రావు, అరుణ్‌కుమార్, విజయ్‌భాస్కర్‌గౌడ్, నవీన్ పాల్గొన్నారు. -
గౌడ జాతి అభ్యున్నతికి ప్రభుత్వ చర్యలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్లుగీత వృత్తికి ఊపిరి పోసేలా ప్రభుత్వ కొత్త గీత విధానం ఉందని, గీత వృత్తిదారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కౌండిన్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు చెప్పారు. చలపాటి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని పాతపాడులో సీఎం వైఎస్ జగన్‌కు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ గీత కార్మికులు మోకు మోస్తాదులతో కృతజ్ఞత ప్రదర్శన నిర్వహించారు. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం సెంటర్లో సీఎం జగన్, మంత్రి జోగి రమేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చలపాటి మాట్లాడుతూ కొత్తగా వైఎస్సార్ గీత కార్మిక భరోసా పథకాన్ని ప్రకటించడంతో పాటు.. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గౌడ జాతి అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు వీరంకి రామచంద్రరావు, నగర నాయకుడు మాదు సాంబశివరావు, పాతపాడు ఎంపీటీసీ సభ్యుడు మరీదు బాలకోటేశ్వరరావు, సంఘ నాయకులు బెజవాడ ఏడుకొండలు, పలగాని రాంబాయి, పామర్తి శ్రీనివాసరావు, ఆరేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గీత.. కృతజ్ఞత
పశ్చిమ గోదావరి,కామవరపుకోట: గీత కార్మికులు కల్లు గీసుకుని భౌతిక దూరం పాటిస్తూ చెట్టు వద్ద అమ్ముకోవచ్చని జీఓ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కామవరపుకోట గౌడ సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. మిడత రమేష్‌బాబు ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా తాటిచెట్టు పైకి సీఎం జగన్ చిత్రపటాన్ని తీసుకుని వెళ్లి వినూత్నంగా హర్షం వ్యక్తం చేశారు. గౌడ సంఘ ప్రతినిధులు పలివెల ప్రభాకర్, వేముల సాయి, బి.లక్ష్మణరావు, నూతి శ్రీను, పరసా మోహన్, నూతి నాగరాజు పాల్గొన్నారు. -
తీపి కబురు
గద్వాల : గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వీరికోసం హరితహారం కార్యక్రమం ద్వారా ఈత, తాటి, ఖర్బూజా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో నాటేందుకుగాను గీత కార్మికుల సంఘాలకు వీటిని అందిస్తోంది. వాస్తవానికి ఎక్సైజ్ శాఖకు ఏటా గీత కార్మికులు వివిధ రూపాల్లో పన్ను చెల్లిస్తున్నారు. ఇక ఎలాంటి పన్నులు చెల్లించకుండా తమ వృత్తిని కొనసాగించేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా జిల్లాలోని గద్వాల, గట్టు, మల్దకల్, కేటీదొడ్డి, ఇటిక్యాల, రాజోళి, ధరూరు, వడ్డేపల్లి, అయిజ తదితర మండలాల్లో సుమారు 2,400మంది గీత కార్మికులు ఉన్నారు. ఒక్కో సంఘంలో 20నుంచి 30 మంది వరకు సభ్యులు ఉన్నారు. అలాగే 68 వ్యక్తిగత లైసెన్సులు ఉన్నాయి. ఏటా లైసెన్స్‌తోపాటు వివిధ రకాల పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖ రూ.22,05,250 వసూలు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ఎవరూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపాటికే హరితహారంలో భాగంగా గట్టు మండలం తప్పెట్లమెర్సులోని పదెకరాల్లో ఈత, ఖర్బూజ మొక్కలను నాటించింది. గీత కార్మికులు కల్లును గీసే క్రమంలో ప్రమాదం జరిగితే రూ.ఐదు లక్షల బీమా అందించనుంది. సంఘాల ద్వారా ప్రతి కార్మికుడికి రూ.రెండు లక్షల రుణ సదుపాయం కల్పించింది. ఇప్పటికే 50ఏళ్లుపై బడిన వారికి పింఛన్ కింద నెలకు రూ.వేయి అందిస్తోంది. మరోవైపు కల్తీ సారా, గుడుంబా తయారీ చేయకుండా వివిధ రకాల వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి గౌరవప్రదమైన జీవితం కల్పించింది. దీంతో గౌడ కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సంతోషదాయకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం. ప్రస్తుతం స్వచ్ఛమైన కల్లు దొరకడం కష్టంగా మారింది. ఇదే అదనుగా భావించిన కొందరు విష రసాయనాలతో తయారుచేసిన కల్లును విక్రయిస్తూ గీత కార్మికులను పెడదోవ పట్టిస్తున్నారు. దీనిని నివారించేందుకుగాను ఈత, ఖర్బూజ మొక్కలను విరివిగా పెంచాలని ఆదేశించడం శుభసూచకం. దీంతో కొందరు పంట పొలాల మధ్య వీటికి సాగుకు ముందుకు వస్తున్నారు. పన్నుల నుంచి మినహాయించడం ఇవ్వడం ఉపశమనం. – వెంకటేష్‌గౌడ్, గువ్వలదిన్నెతండా, కేటీదొడ్డి మండలం కార్మికులకు మరింత భరోసా గీత కార్మికులకు పలు వరాలు కురిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం శుభపరిణామం. గతంలోవలే సొసైటీలను తయారు చేసుకునే వీలు కల్పించడం, ఈత, తాటి చెట్లకు పన్ను రద్దు చేయడం సంతోషంగా ఉంది. ము ఖ్యంగా గీత కార్మికులకు పింఛను, బీమా పెంచడంతో ఆయా కుటుంబాలకు మరింత భరోసా లభించింది. – పరమేష్‌గౌడ్, పెద్దధన్వాడ, రాజోళి మండలం -
రాయితీపై తాటిచెట్లు ఎక్కే మిషన్లు!
గీత కార్మికుల ప్రమాదాల నివారణకు ప్రభుత్వ ప్రయత్నం హైదరాబాద్: కాళ్లు, చేతులతోపాటు శరీరమంతా తన అధీనంలో ఉంచుకొని ప్రతిరోజు తాటి చెట్టు ఎక్కేందుకు సాహసం చేసే గీత కార్మికులు తర చూ ప్రమాదాల బారిన పడి మృత్యుఒడిలోకి చేరిన సంఘటనలు కోకొల్లలు. అంగవైకల్యానికి గురవుతున్నవారి సంఖ్యకు కొదవేలేదు. దీనిపై దృష్టి సారించిన రాష్ర్ట ప్రభుత్వం గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా తాటిచెట్లు ఎక్కే మిషన్లను తెప్పించాలని యోచిస్తోంది. ఇప్పటికే కేరళ, తమిళనాడుల్లో కొబ్బరి, పామ్ చెట్లు ఎక్కేందుకు వినియోగిస్తున్న మిషన్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టేలా కసరత్తు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్... కులవృత్తుల వారికి అవసరమైన పనిముట్లను తయారు చేసే అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌తో సంప్రదింపులు జరిపారు. ఫౌండేషన్ నిపుణులతో పైలట్ ప్రాజెక్టు కింద ప్రయోగాలు చేయాలని నిర్ణయించారు. ఈ మిషన్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవని గీత కార్మికులకు నమ్మ కం కుదిరితే రాయితీపై వాటిని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మిషన్‌ను తాటిచెట్టుకు అనుసంధానించి సైకిల్ పెడల్స్లా ఉండే వాటిపై నిలబడి తొక్కడం ద్వారా చెట్టుపైకి వెళ్లే వీలు లభిస్తుంది. కనీస ధర రూ. 5 వేలతో మొదలై కోరుకునే సౌకర్యాన్ని బట్టి తదనుగుణమైన ధరల్లో మిషన్లు లభిస్తాయి.