నేటి నుంచి ప్రభుత్వ డ్రైవర్ల సమ్మె
Published Tue, Feb 11 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల ప్రభుత్వ వాహన డ్రైవర్లు మంగళవారం నుంచి సమ్మెలో కి వెళుతున్నట్టు ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక సం ఘ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. వివిధ అంశాలతో పాటు సమైక్య ఉద్యమంలో పాలుపంచుకునే విషయమై చర్చిం చారు. ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికఆధ్వర్యంలో సమైక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా రిటైర్డ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు సమైక్య ఉద్యమంలో పాల్గొననున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్య ఉద్యమ కార్యాచరణలో రూపొందిం చిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొం టున్నట్టు తెలిపారు. అత్యవసర సర్వీసులైన ఫైర్, ప్రభుత్వాస్పత్రి డ్రైవర్లు మినహా ఇతర శాఖల డ్రైవర్లు సమ్మెలో పాల్గొంటారన్నారు. సంఘ నాయకు లు ఈశ్వరరావు, నాగేశ్వరరావు, సూరి శెట్టి గణేష్, వెంకటపతిరాజు, బి.నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement