ఆర్టీసీ డిపో మేనేజర్ పై కార్మికుల దాడి యత్నం
Published Sun, Aug 24 2014 1:29 PM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
కాకినాడ: విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు వేస్తున్నారనే ఆరోపణపై కాకినాడ ఆర్టీసీ డిపో కార్మికులు ఆదివారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. కార్మికుల ఆందోళనతో ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఓ దశలో కార్మికులు డిపో మేనేజర్ సుధాకర్‌పై దాడికి యత్నించారు.
అయితే కార్మికుల ఆరోపణల్ని సుధాకర్ తోసిపుచ్చారు. డిపో మేనేజర్ వ్యవహారతీరు మార్చుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల ఆందోళనతో కాకినాడ డిపోలో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు.
Advertisement
Advertisement