సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగించిన ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై దృష్టి సారించింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముందని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. దీనిని సభలో ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉందన్నారు. సీఎం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో తాము స్పీకర్‌కు అందించినవి అఫిడవిట్లు కాదని, కేవలం స్టేట్‌మెంట్లేనని ఆనం చెప్పారు. అఫిడవిట్లు వేరు, స్టేట్‌మెంట్లు వేరన్నారు.