
సాక్షి, అమరావతి: యూనివర్సిటీల పరీక్షల నిర్వహణలో.. యూజీసీ నిర్దేశించిన కోవిడ్–19 ప్రొటోకాల్‌ను పాటించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వైస్ ఛాన్సలర్లను ఆదేశించారు. వర్సిటీ వీసీలతో ఆయన రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సదస్సు నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విసిరిన సవాలును సమర్థంగా ఎదుర్కొంటూ ఆన్‌లైన్‌లో తరగతుల నిర్వహణకు వీలుగా (సిలబస్‌ను రీడిజైన్) పాఠ్యాంశాలను పునర్ వ్యవస్థీకరించాలని సూచించారు.