ఆత్మకూర్, న్యూస్‌లైన్: సంబంధ బంధాలు, సంప్రదాయాలను తెలియజేసే పండుగల్లో సం క్రాంతి ఒకటని మంత్రి డీకే అరుణ అన్నారు. మకర సంక్రాంతి పండుగ వేళ కొత్త ఆశలు, కొత్త కోర్కెలతో ప్రతి ఒక్కరు తమ జీవిత లక్ష్యాలు సాధించాల ని ఆకాంక్షించారు. మన సంప్రదాయాలను ముందుతరాలకు తెలిపేవిధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సోమవారం ఆత్మకూర్ ప ట్టణంలో ‘సాక్షి’, ఎంవీ రామన్ టెక్నోస్కూల్, శృతి జువెలర్స్‌సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులపోటీ బహుమతుల ప్రధానోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలని, వర్షాలు సకాలంలో కురిసి రైతులు బాగుండాలని కోరారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళలే కాకుండా స్థానిక మహిళలు కూడా స్వచ్ఛందంగా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణం అంతరించిపోతున్న నేటితరుణంలో గంగిరెద్దుల విన్యాసం, పతంగులను ఎగురవేసే సన్నివేశాలు ఉల్లాసపరిచాయన్నారు.
ఆత్మకూర్, గద్వాలకు అనేక రకాల సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని, ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతారని, త్వరలో గద్వాలను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేసుకుందామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ గంగాధర్‌గౌడ్, ఎంవీ రామన్ స్కూల్ అధినేత శ్రీధర్‌గౌడ్, శృతి జువెల్లర్ అధినేత గాడి లక్ష్మినారాయణ, ప్రిన్సిపాల్ హ్యాన్సి శ్రీధర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెనుశ్రీ, కురుమూర్తి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే...
ముగ్గుల పోటీల్లో నారాయణపేటకు చెందిన ఎస్.కరుణ మొదటి బహుమతి దక్కించుకోగా, గద్వాలకు చెందిన శ్రీలక్ష్మి రెండు, మహబూబ్‌నగర్‌కు చెందిన సుజాత మూడు బహుమతులు గెలవగా, అరుణ (మహబూబ్‌నగర్), భానుప్రియ(ఆత్మకూర్)లు నాలుగు, సీమ (మహబూబ్‌నగర్), ప్రియాంక (ఆత్మకూర్)లు ఐదో బహుమతి సాధించారు.
సంప్రదాయాల సమ్మేళనమే సంక్రాంతి
Published Tue, Jan 14 2014 3:05 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement