ఈ తరహాలో పశువులు మరణిస్తే పథకం వర్తిస్తుంది..
పాలకొండ రూరల్: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, యజమానులు, కాపలాదారులకు ఆసరాగా నిలిచేందుకు ‘వైఎస్సార్ పశుసంరక్షణ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు చేస్తోంది.
జిల్లా వ్యాప్తంగా...
వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాలో పాడి పెంపకం ఆ తర్వాతి స్థానంలో ఉంటూ రైతులకు ఆసరాగా నిలుస్తుంది. ఈ క్రమంలో యానిమల్ కార్డుల ద్వారా దాదాపు లక్ష మంది పశు సంపద కలిగిన రైతులకు, పాడి పరిశ్రమల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది. గ్రా మ సచివాలయాలకు అనుసంధానం చేసిన పశువైద్య సహాయకులు ఈ కార్డుల మంజూరుకు అర్హులైన రైతులకు సహకరిస్తారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో గల ( 085–00–00–1962, 1907) వంటి టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఈ పథకాన్ని పొందేందుకు అవకాశం ఉంది.
జిల్లావ్యాప్తంగా దాదాపు లక్షకు పైబడి మూగప్రాణులకు ఈ కార్డులు మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా పశువు ఆరోగ్య సంరక్షణకు చర్యలు, కృత్రిమ గర్భధారణ, సూడి పశువులు, దూడలు, పోషకాలు, పశుసంపద వివరాలు నమోదు చేస్తారు. ఆర్‌బీకే కేంద్రాల వద్ద పశువుల బోనులు ఏర్పాటుచేసి వాటి ఆరోగ్య తాజా స్థితిగతులు గుర్తిస్తారు. ఈ నేప థ్యంలో ఆవులు, మేకలు, గొర్రెలు, బర్రెలు కలిపి జిల్లావ్యాప్తంగా సుమారు 16 లక్షల 96వేల పైబడి ఉన్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీరంతా ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచిస్తున్నారు.
పథకం తీరుతెన్నులు..
ఎలాంటి ముందస్తు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని అర్హులకు అందిస్తారు. జీవాల పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న బర్రెలకు వర్తింపజేస్తారు. పశువు మరణిస్తే మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేలు పరిహారం అందిస్తారు. ఏడాదికి ఒక పాడి రైతు కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. ఆరు నెలల నుంచి ఆపై వయసున్న మేకలు, గొర్రెలకు ఈ పథకం వర్తింపజేస్తారు. ఒకేసారి మూడు నుంచి అంతకన్నా ఎక్కువ జీవాలు మరణిస్తే పథకం వర్తిస్తుంది. ఒక్కో జీవానికి రూ.6వేల వంతున ఏడాదిలో ఒక్కో కుటుంబం గరిష్టంగా రూ.1.20 లక్షలు పరిహారం పొందవచ్చు.
ఏడాది కాలంలో రూ.1.35 కోట్లు
గడిచిన ఏడాది కాలంలో పథకం ద్వారా రూ.1.35 కోట్ల నష్టపరిహారం పశువులు, జీవాలను నష్టపోయి న అర్హులకు అందించాం. మరో రెండు కోట్ల పరిహారానికి సంబంధించి నగదు త్వరలో లబ్ధిదారులకు అందించనున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా పా డి రైతులు, యజమానులు, కాపర్లు తమ వివరాలు నమోదు చేసుకుంటే సరి పోతుంది. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులకు కార్డులను ఆర్‌బీకేల ద్వారా అందిస్తాం. ఈ కార్డులు నాలుగేళ్లు పనిచేస్తాయి. లబ్ధి పొందేందుకు ఈ పథకాన్ని సది్వనియోగపర్చుకోవాలి. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.
– డాక్టర్ ఆరిక ఈశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment