అసంపూర్తిగా ముగిసిన చర్చలు
13వ తేదీకి వాయిదా
సాక్షి, హైదరాబాద్: 108 సిబ్బంది సమస్యలపై అదనపు లేబర్ కమిషనర్ వై.సూర్యప్రసాద్ సమక్షంలో యాజమాన్యం, 108 యూనియన్‌ల మధ్య గురువారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కనీస వేతనం పెంపు, 8 గంటల పనివిధానం, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం తదితర డిమాండ్లపై జీవీకే, ఈఎంఆర్‌ఐ యాజమాన్యం దిగిరాకపోవడంతో ఐదవ దఫా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలను 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సూర్యప్రసాద్ ప్రకటించారు. చర్చల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా, 108 సిబ్బంది యూనియన్ గౌరవాధ్యక్షుడు భూపాల్, అధ్యక్షుడు అప్పిరెడ్డి తదితరులు, జీవీకే యాజమాన్యం పక్షాన భట్టాచార్య, మూర్తి పాల్గొన్నారు. అనంతరం సాయిబాబా, భూపాల్, అప్పిరెడ్డిలు విలేకరులతో మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై యాజమాన్యం మొండివైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
పర్మనెంట్ చేస్తే గ్రామాల్లో సేవలందిస్తాం: జూడాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం జూనియర్ డాక్టర్లను పర్మనెంట్ చేసినట్లయితే.. గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జూడాల అధ్యక్షుడు డాక్టర్ వంశీ తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం ముందు జూనియర్ డాక్టర్లు గురువారం ధర్నా నిర్వహించారు. డీఎంఈ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జూడాలు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించనట్లయితే.. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
108 చర్చలు మళ్లీ విఫలం..
Published Fri, Aug 9 2013 6:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement