గంటా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న వైఎస్ జగన్
దేవరపల్లి పొగాకు రైతుల సమావేశంలో జగన్ అల్టిమేటమ్
దేవరపల్లి నుంచి సాక్షి ప్రతినిధి: పొగాకు పండించే రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుంటే చంద్రబాబు ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఇందుకు ఈ నెల 10 తుది గడువు అని కూడా ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో పొగాకు సాగుచేసే జిల్లాల్లో రైతుల పక్షాన ప్రత్యక్ష ఆందోళనలో భాగంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
ఆయన శనివారం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మూడురోడ్ల జంక్షన్ నుంచి పొగాకు వేలం కేంద్రానికి ఎడ్ల బండిపై వెళ్లారు. పొగాకు సాగులో ఎదురవుతున్న నష్టాన్ని తగ్గించడంలో సర్కార్ వైఫల్యంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం ఇలా..
కేజీకి రూ.150 ఇవ్వాల్సిందే: గత ఎన్నికల ముందు ఇదే పొగాకుబోర్డు వద్ద మీటింగు పెట్టి రైతుల వద్దకు వచ్చిన చంద్రబాబుై రెతుల రుణాలు అన్నీ మాఫీ చేసేస్తానని చెప్పారు. మీలో ఎంత మంది రుణాలు మాఫీ అయ్యా యో చెప్పండి.. ఇదీ రైతులకు చంద్రబాబు చే సిన ద్రోహం.బాబు సీఎం అయ్యేనాటికి కేజీ రూ.172లు పలుకుతోంది. ఇవాళ పొగాకు ధర యావరేజ్‌గా రూ.117 అని చెబుతున్నారు. రైతుల దగ్గరకు వెళ్లి అడిగితే రూ.110లు కూడా దక్కడంలేదంటున్నారు. ఎకరాకు 20వేలు నష్టపోతున్నామని బాబు దగ్గరకు వెళితే ఏమన్నా డో తెలుసా... నాకు సంబంధించిన విషయం కాదని సిగ్గులేకుండా చెప్పాడు.
గతంలో రైతులు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు దివంగత నేత వైఎస్ స్టేట్ ట్రేడిం గ్ కార్పోరేషన్ కు రూ.500 కోట్లు కేటాయించి పొగాకు కొనుగోళ్లు చేయించారు. ఇప్పుడూ స్టేట్‌ట్రేడింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి. వైఎస్ కొనుగోలు చేసినట్టుగా గిట్టుబాటు ధర వచ్చే లా కొనుగోలు చేయాలి. జగన్ వస్తున్నాడని కేజీ ధర రూ.10 పెరిగిందని రైతు లు చెబుతున్నారు. దీంతో సంతోషపడేది లేదు. ఖచ్చితంగా రూ.150 చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేదంటే 10 నుంచి పొగాకు పండించే జిల్లాల్లో ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నా.
పొగాకు బేళ్ల మధ్య జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోలు పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. జగన్‌తోపాటు రైతులు పెద్ద ఎత్తున వేలం కేంద్రంలోకి వెళ్లడంతో బయ్యర్లు కొనుగోలు చేయలేమన్నారు. చివరకు అనివార్యంగా కొనుగోలుకు ముందుకు వచ్చారు. కొనుగోలు మిషన్‌ను తీసుకున్న జగన్ వాటి పనితీరును పరిశీలించి ధర నిర్ణయాన్ని స్వయంగా చూశారు. తక్కువగా వస్తున్న ధరను చూసిన జగన్ చలించిపోయారు.
ఒక్కో మృతునికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
* విజయవాడలో విద్యుత్ షాక్ మృతుల కుటుంబాలను ఓదార్చిన జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలో విద్యుత్ షాక్‌తో ఐదుగురు మృతి చెందిన ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఒక్కో మృతునికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతనెల 30న విజయవాడ భవానీపురంలోని ఊర్మిళనగర్‌లో విద్యుత్ షాక్‌కు గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు.
వారి కుటుంబాలను శనివారం రాత్రి జగన్ ఓదార్చారు.మృతుడు గంటా సుబ్బారెడ్డి భార్య చిన్నక్కతోను, ఆమె కుమారుడు తిరుపతిరెడ్డితోను జగన్ మాట్లాడారు. అండగా ఉం టామని ధైర్యం చెప్పారు. సుబ్బారెడ్డి పక్కింటిలో నివసిస్తున్న బొమ్మారెడ్డి తిరుపతిరెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ తిరుపతిరెడ్డి భార్య రాధమ్మను పరామర్శించారు. అక్కడే మీడియాతో మాట్లాడారు.
నేనున్నాను... ధైర్యంగా ఉండండి
నందిగామ/ నందిగామ రూరల్: మీ కుటుంబానికి అండగా ఉంటాను.. మీకేమీ భయం లేదు.. ధైర్యంగా ఉండండి.. అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ పట్టణ కన్వీనర్ పాములపాటి రామకృష్ణ కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. రామకృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలోని అనాసాగరం గ్రామంలో ఆయన కుటుంబసభ్యులను శనివారం జగన్ పరామర్శించారు. రామకృష్ణ మృతితో శోక సంద్రంలో ఉన్న అతని కుటుంబ సభ్యులు తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సీత, భార్య పావనితో పాటు చెల్లెళ్లను, అక్కడకు చేరుకున్న బంధువులను ఆయన పేరుపేరున పరామర్శించి ఓదార్చారు.