రాష్ట్రంలోని రైతులు ప్రస్తుతం ఎరువుల కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రైతు రుణమాఫీ అమలు కాక అన్నదాతలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి యూరియా కొరత తోడ వడంతో రైతుల పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడినట్లైంది. ఆరు గాలం కష్టపడి పండిస్తున్న పంటకు చివరి దశలో యూరియా కొరత రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు ఎదురౌతుండటంతో దిక్కులేక బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికా రంలోకి వచ్చినప్పటినుంచి రైతులను చిన్నచూపు చూస్తోంది. రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్న చంద్రబాబు మాటలకే పరిమితం అవుతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు యూరియా కొరతను తగ్గించాలి. దేశీయంగా ఏటా 2 కోట్ల 20 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా, 80 లక్షల టన్నుల యూరియాను విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా దేశీయంగా యూరియా కొరతను తగ్గించడానికి కొత్త ప్లాంట్లను త్వరితంగా ఏర్పాటు చేయవల సిన అవసరం ఎంతైనా ఉంది.
- బట్టా రామకృష్ణ దేవాంగ దక్షిణ మోపూరు, నెల్లూరు
యూరియా కొరత తీర్చాలి
Published Sat, Jan 24 2015 1:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement