Shortage of urea
-
కేసీఆర్ ముందు మీ పప్పులు ఉడకవు!
సాక్షి, నల్గొండ: రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో యూరియా కొరత లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియాను తెప్పించాల్సిన కనీస బాధ్యత బీజేపీ నాయకులకు లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఢిల్లీలో కూర్చొని రాజకీయాలు చేస్తూ తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గుత్తా మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ ముందు బీజేపీ పప్పులు ఉడకవన్నారు. బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టు పూర్తికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిప్రాదికన ముందుకుపోతోందని ఈ సందర్భంగా తెలిపారు. బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టులో కమీషన్లు పొందిన నీచ చరిత్ర కోమటిరెడ్డిది అని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కల్లు తాగిన కోతి అని, తప్పతాగి పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి వ్యాఖ్యాలపై స్పందించాలంటేనే అసహ్యంగా ఉందని విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, విజ్ఞత అవసరమని, అయితే అవి రెండూ కోమటిరెడ్డికి తెలియదని గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
‘యూరియా’ పాట్లు
సాక్షి, యాదాద్రి: అన్నదాతలు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. జిల్లాకు సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో రైతన్నలకు పడిగాపులు తప్పడం లేదు. ఇదే అదనుగా ఇటు డీలర్లు, అటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ చీకటి వ్యాపారం సాగిస్తున్నారు. భువనగిరి కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలో భువనగిరికి చెందిన యూరియాను పోలీసులు పట్టుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు పీఏసీఎస్ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. రామన్నపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూకట్టి మరీ కొనుగోలు చేయడం జిల్లాలో యూరియా కొరత ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. కొరవడిన అధికారుల పర్యవేక్షణ.. పైగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టకపోవడం.. వెరసి జిల్లాలో యూరియా యథేచ్ఛగా చీకటిబజార్‌కు తరలిపోతోంది. కరువును అధిగమిస్తూ వరిని సాగుచేసిన రైతాంగాన్ని యూరియా కొరత తీవ్రమైన మనోవేదనకు గురిచేస్తోంది. సకాలంలో యూరియా అందకపోవడంతో రైతన్న పడిగాపులు కాస్తున్నాడు. సరఫరా లేదంటూ డీలర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల అవసరాన్ని కొందరు సొమ్ము చేసుకుంటుండగా మరికొందరు భువనగిరి కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా పక్కా రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఈ దందాకు అడ్డుకట్ట వేయడంలో జిల్లాలో వ్యవసాయాధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు రైతులు నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఎరువుల డీలర్లు, మార్క్‌ఫెడ్ ద్వారా సింగిల్ విండోలు యూరియా సరఫరా చేస్తున్నప్పటికీ బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రవాణా చార్జీల పేరుతో ఎమ్మార్పీ కంటే రూ.70నుంచి రూ.80వరకు అదనంగా అమ్ముతున్నారు. భువనగిరి, వలిగొండ, మోత్కూర్, చౌటుప్పల్, రామన్నపేట, తుర్కపల్లి మండలాల్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నా అధికారులు నియంత్రించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఓఆర్ఆర్పై పట్టుబడ్డ భువనగిరి యూరియా.. భువనగిరి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మధనపల్లికి అక్రమంగా తరలిపోతున్న 10టన్నుల యూరియాను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్పై పోలీసులు తాజాగా పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతోపాటు యూరియాను స్వాధీనం చేసుకున్నారు. సోడియం నైట్రేట్ పేరుతో వెళ్తున్న లారీలో అమ్మోనియం నైట్రేట్ ఉండడంతో ఈ చీకటి వ్యాపారం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు అక్రమంగా హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని తెలుస్తోంది. బస్తా యూరియా రూ.350పై మాటే.. యూరియా బస్తా ఎమ్మార్పీ ప్రకారం రూ.266.85 విక్రయించాలి. డీలర్లు రవాణా చార్జీల పేరుతో కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. కంపెనీలు సరఫరా చేసిన ర్యాక్ పాయింట్ నుంచి తీసుకొవచ్చిన యూరియా రవాణా చార్జీల పేరుతో ధరలు పెంచేస్తున్నారు. సరైన తనిఖీలు లేకపోవడంతో యూరియాను రాక్‌పాయింట్ నుంచే చీకటిబజార్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది. అలాగే రైతులకు అమ్మే యూరియాపై అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో యూరియా బస్తాను హోల్‌సెల్ డీలర్లే రూ.320కి రిటైల్ డీలర్లకు విక్రయిస్తుండగా రిటైల్ డీలర్ రైతులకు రూ.350కిపైగా విక్రయిస్తున్నారు. రైతులు సీజన్‌కు అనుగుణంగా యూరియా కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పత్తా లేకుండా పోయారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రో జులుగా భువనగిరిలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న అటువైపు కన్నెత్తి చూసే అధికారే లేకుండాపోయారని రైతులు ఆరోపిస్తున్నారు. నిజంగా యూరియా కొరత ఉందా..! జిల్లాలో యూరియా కొరతపై అధికారులు రైతులకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కనీసం రైతుల అవసరాలను గుర్తించి యూరియా కొరతపై అధికారులు ప్రచారం నిర్వహించ లేకపోతున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల పలు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఎంత యూరియా ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది అన్న విషయాన్ని అధికారులు ప్రకటించలేదు. అయితే 20రోజులుగా కురుస్తున్న చెదురుమదురు వర్షాలతో పంటలకు యూరియా కోసం రైతులు దుకా ణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. యూరి యా కంపెనీల నుంచి సరిపోను యూరియా సప్లయ్ చేయకపోవడంతో కొరత ప్రారంభమైంది. జిల్లాకు వచ్చిన యూరియాలో 50శా తం సింగిల్‌విండోల ద్వారా, 50శాతం ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు చార్జీల పేరుతో వసూలు.. యూరియా డీలర్‌కు సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్‌పోర్టు చార్టీల పేరుతో వసూలు చేస్తున్నాయి. మిర్యాలగూడ, హైదరాబాద్ ర్యాక్‌ల నుంచి బస్తాకు అదనంగా కిరాయి రూ.20 నుంచి రూ.30వరకు వసూలు చేస్తుండడంతో, డీలర్‌కు చేరే సరికే అది ఎమ్మార్పీ ధర కంటే మించిపోతోంది. జిల్లాలో కోరమాండల్, నాగార్జున, ఉజ్వల, ఇప్కో, క్రుబ్కో, స్పీక్, గోదావరి యూరియా కంపెనీలు ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. డిమాండ్ 42వేల మెట్రిక్ టన్నులు వచ్చింది 12వేల మెట్రిక్ టన్నులు ప్రస్తుతం జిల్లాలో సాగైన పంటల అవసరాల కోసం సుమారు 42,223 మెట్రిక్ టన్నుల యూ రియా డిమాండ్ ఉండగా కాని ఇప్పటి వరకు కేవలం 12వేల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇందులో 6వేల మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌కు కేటాయించగా, 6వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల దుకాణాలకు కేటాయించారు. దుకాణాల నుంచి రైతులకు చేరింది తక్కువేనని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి ప్రస్తుత ఖరీఫ్‌లో కావాల్సిన యూరియా 42,200 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు జిల్లాకు సరఫరా అయ్యింది 12,000 మెట్రిక్ టన్నులు -
ఇతర ఎరువులు కొంటేనే..యూరియా
‘యూరియా కొరత లేదు.. డీలర్లే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, అలాంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం...వ్యవసాయ అధికారులు యూరియా కొరతపై నిఘా పెట్టాలి, అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకోవాలి..’ ఇవీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటిపుల్లారావు వ్యవసాయాధికారులకు జారీ చేసిన ఆదేశాలు.. ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతనే కుదరడం లేదనేందుకు మంత్రిగారి మాటలే సాక్ష్యాలు. జిల్లాలో ఎక్కడాగానీ బస్తా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్న మంత్రుల తీరుపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేస్తే బస్తా యూరియా ఇవ్వని ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఈ రబీలోనూ వేసవి పంటలను సాగు చేసిన రైతులను యూరియా కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఏమీ చేయలేని సంకట స్థితిలో ఉన్నారు. దాదాపు నెల రోజులుగా జిల్లాకు ప్రతిపాదనల ప్రకారం రావాల్సిన యూరియా రాకపోవడంతో కొరత తీవ్రమైంది. పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రొద్దుటూరుకు శనివారం 16 టన్నుల యూరియా రాగానే గంటలో అయిపోయింది. యూరియా బస్తా ధర రూ. 284లు కాగా కొందరు డీలర్లు అక్కడక్కడ అక్రమంగా నిల్వ చేసుకున్న యూరియాను రూ. 350 నుంచి రూ. 550ల ధరతో కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. కొందరు డీలర్లు రహస్యంగా దాచుకున్న ప్రాంతాలకు రైతులను తీసుకెళ్లి అటు నుంచి అటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ‘సాక్షి’ విజిట్‌లో వెల్లడైంది. జమ్మలమడుగు మండలానికి 20 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇంత వరకు ఒక టన్ను కూడా రాలేదని వ్యవసాయాధికారులు తెలిపారు. మైదుకూరు డివిజన్‌కు 100 మెట్రిక్ టన్నులు డిమాండ్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాజంపేట, బద్వేలు డివిజన్లలో వరి నారు పోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు. నాట్ల నుంచి పంటకు యూరియా అవసరం ఉందని, అయితే ఎక్కడా లభించడం లేదని రైతులు ఆవేదనతో తెలిపారు. దీంతో కొందరు డీలర్లు కొరతను సాకుగా తీసుకుని బస్తా రూ. 350 నుంచి రూ.550లకు విక్రయిస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పులివెందుల లాంటి ప్రాంతాల్లో కొందరు డీలర్లు ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని ఆంక్షలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో యూరియా కొరతపై ప్రజా ప్రతినిధులుగాని, జిల్లా అధికార యంత్రాంగంగాని ఏ మాత్రం స్పందించడం లేదని కడపలోని అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు, అందునా సీఎం చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు తీరు దారుణమని విమర్శించారు. ఎదుగుదల లేని పంటలు.. జిల్లాలో కుందు, పెన్నా నదీ పరివాహక ప్రాంత గ్రామాలతోపాటు నీటి వనరులున్న ఇతర ప్రాంత రైతులు వరి, దోస, ఉల్లి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్న, కూరగాయ పంటలతోపాటు మామిడి, అరటి, బొప్పాయి పంటలను సాగు చేశారు. ఆయా పంటలకు యూరియా ఎరువు అవసరం ఎక్కువగా ఉంటోంది. జిల్లాలో ప్రధానంగా కమలాపురం, వల్లూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చెన్నూరు, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, బి మంఠం, బి కోడూరు, పోరుమావిళ్ల, వేంపల్లె, పెండ్లిమర్రి మండలాల్లో వరి పంట సాగు ఊపందుకుంది. రైతులు నారుపోసుకుని నాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పైరు ఎదుగుదలకు ప్రధానంగా రైతులు యూరియా పొలంలో చల్లుతారు. అయితే ఆ ఎరువునకు ఇప్పుడు కొరత ఏర్పడడంతో పంట ఎదుగుదల కావడం లేదు. వైఎస్సార్ జిల్లా అంటే ఇంత చులకనా..: ఈ సీజన్‌కుగాను అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు జిల్లా వ్యవసాయాధికారులు 28,537 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ప్రతిపాదనలను రాష్ట్ర వ్యవసాయశాఖకు పంపారు. అయితే ప్రభుత్వం కేవలం 17,242.6 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే మంజూరు చేసింది. అలాగే జనవరి నెలకు 4735 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రతిపాదనలు పంపగా ఇంత వరకు పిడికెడు యూరియా కూడా జిల్లాకు రాకపోవడం విశేషం. యూరియా కొరత నిజమే జిల్లాలో యూరియా కొరత ఉందని, వెంటనే ఒక రేక్ (2600 మెట్రిక్ టన్నులు) కావాలని కోరాం. ఆ మేరకు రాష్ట్ర వ్యవసాయ కమీషనర్ అంగీకరించి పంపుతామన్నారు. ఆ రేక్ రాగానే జిల్లాలోని అన్ని మండలాలకు పంపుతాం. ఎక్కడా కొరత రాకుండా చూస్తాం. -జ్ఞానశేఖర్, ఇన్చార్జ్ జేడీ, జిల్లా వ్యవసాయశాఖ -
యూరియా కొరత లేకుండా చూస్తాం
నెల్లూరు(అగ్రికల్చర్): అన్నదాతలను యూరియా కష్టాలు వీడటం లేదు. రైతులు ఎరువుల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం నుంచి సొసైటీ కార్యాలయాల వద్ద కాచుకు కూర్చున్నా బస్తా కూడా చేతికి అందకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేస్తున్నారు. శుక్రవారం కూడా జిల్లాలో పలు ప్రాథమిక సహకార సంఘాల కార్యాలయాల ఎదుట అన్నదాతలు బారులు తీరారు. రోజంతా యూరియా కోసం క్యూలో నిలబడ్డా బస్తాకూడా అందకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ అధికారులకు ముందుచూపు లేకపోవడంతో జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు అధికార పక్షాల పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జానకి స్వయంగా రంగంలోకి దిగి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అదుపులోకి రాలేదంటే యూరియా సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గత ఏడాది రబీ సాగుకు 96వేల మెట్రిక్ టన్నులు రాగా ఈ ఏడాది ప్పటివరకు 70వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అలస్యంగా సీజన్ ప్రారంభం కావడం, వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత, వచ్చిన ఎరువులు సైతం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుండటం రైతులు కునుకు లేని రాత్రులను గడుపుతున్నారు. సీజన్ దాటిపోతుండటంతో యూరియా కోసం రైతులు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సరిపడా యూరియాను సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణలో విఫలం చెందారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతన్న కన్నెర్ర మనుబోలులోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఎకరాకు రెండు బస్తాల యూరియా ఇవ్వాల్సి ఉండగా అధికారులు ఒక్కొక్కరికి ఒక బస్తా మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఆత్మకూరు మండలం బట్టేపాడు పీఏసీఎస్‌లో యూరియా కోసం మండుటెండను లెక్క చేయకుండా అన్నదాతలు బారులుతీరారు. రైతులు భారీగా క్యూలో ఉండటంతో తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో వ్యవసాయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు ఎసై రంగంలోకి దిగి రైతులను చెదర కొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సైదాపురంలోని సొసైటీ ఎదుట యూరియాకోసం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
యూరియా కొరత తీర్చాలి
రాష్ట్రంలోని రైతులు ప్రస్తుతం ఎరువుల కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రైతు రుణమాఫీ అమలు కాక అన్నదాతలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి యూరియా కొరత తోడ వడంతో రైతుల పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడినట్లైంది. ఆరు గాలం కష్టపడి పండిస్తున్న పంటకు చివరి దశలో యూరియా కొరత రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు ఎదురౌతుండటంతో దిక్కులేక బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికా రంలోకి వచ్చినప్పటినుంచి రైతులను చిన్నచూపు చూస్తోంది. రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్న చంద్రబాబు మాటలకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు యూరియా కొరతను తగ్గించాలి. దేశీయంగా ఏటా 2 కోట్ల 20 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుండగా, 80 లక్షల టన్నుల యూరియాను విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా ఉత్పత్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా దేశీయంగా యూరియా కొరతను తగ్గించడానికి కొత్త ప్లాంట్లను త్వరితంగా ఏర్పాటు చేయవల సిన అవసరం ఎంతైనా ఉంది. - బట్టా రామకృష్ణ దేవాంగ దక్షిణ మోపూరు, నెల్లూరు -
హాట్‌హాట్‌గా..జెడ్పీ సర్వసభ్య సమావేశం
సాక్షి, హన్మకొండ : యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తోం దంటూ ప్రతిపక్ష పార్టీ సభ్యుల నిలదీత... అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ అధికార పార్టీ సభ్యులు ఆగ్రహావేశాలు వెరసి జిల్లా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ హాల్లో చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ముందుగా వరంగల్‌లో కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నెలకొల్పడంతోపాటు రైతులకు రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చైర్పర్సన్ స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమో దం తెలిపారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు గళమెత్తారు. యూరియా కొరత ఎందుకు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిందని... అయినా యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అధికారులను ప్రశ్నించారు. యూరియా బ్యాగును రూ.284కు బదులు, బ్లాక్మార్కెట్లో రూ.350-రూ.400 వరకు అమ్ముతుంటే అధికారుల ఏం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిం చారు. యూరియాను పంపిణీ చేసే బాధ్యతను పీఏసీఎస్‌ల కు ఇవ్వడం వల్ల రాజకీయ అండదండలు ఉన్న వారికే లా భం జరుగుతోందని, సామాన్య రైతులకు న్యాయం జరగట్లేదంటూ కొందరు జెడ్పీటీసీలు లేవనెత్తారు. దీనిపై కలెక్టర్ కిషన్ స్పందిస్తూ యూరియా రైతులకు అందేలా చూడడం తో పాటు బ్లాక్ మార్కెట్ దందానుు అరికట్టేందుకు వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తామన్నారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రామారావు మాట్లాడుతూ 2009 నుంచి ఇప్పటి వర కు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు రూ. 54 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ వచ్చినట్లు తెలిపారు. రుణమాఫీ పథకం తొలివిడత కింద జిల్లాలో 4.13 లక్షల మంది రైతుల కు రూ. 472 కోట్లు మాఫీ అయ్యాయని చెప్పారు. భూ సర్వే చేస్తున్నాం... దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలలో 6.5 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, వీరిలో గజం భూమిలేని వారిని గుర్తించి మొదటి దశలో పంపిణీ చేస్తామన్నారు. ఆ తర్వాత దశల వారీగా అర్హులకు గుర్తిస్తామని, ఇందుకు సర్వే చేపట్టినట్లు వెల్లడించారు. 2011 గణన ఆధారంగా ఈ సర్వే ను చేపడుతున్నామన్నారు. జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని, ఈ విధానంలో మార్పు తేవాలని ఎంపీ సీతారాంనాయక్ కోరారు. వేయి మంది కార్మికులు ప్రత్యక్షంగా ఆధారపడ్డ కమలాపూర్ బిల్ట్ కర్మాగారాన్ని తెరిపించాలంటూ జిల్లా పరిషత్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 22 స్పెషల్ హాస్టళ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చెరువుల పునరుద్ధరణకు పెద్దపీట పాకాల-జూరాల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో చిన్న, మధ్య నీటి పారుదల రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. గతంలో జిల్లాలో 108 చెరువుల పునరుద్ధరణకు టెండర్లు పిలిచినా.. నేటికీ ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదంటూ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం గత ప్రతిపాదనలు రద్దు చేసిందని, త్వరలో కొత్త ప్రతిపాదనలతో పనులు ప్రారంభిస్తామని అధికారులు సమాధానమిచ్చారు. మరమ్మతులు, ఆధునీకరణ(రిపేర్, రిస్టోర్, రినోవేషన్, ఆర్ఆర్ఆర్) పథకం ద్వారా జిల్లాలో రూ.100 కోట్ల నిధులతో 398 పనులు చేపట్టనున్నట్లు వివరించారు. జిల్లాలో 750 గొలుసుకట్టు చెరువులు గుర్తించామని, వీటి పునరుద్ధరణకు రూ. 156 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని చిన్ననీటి పారుదల ఎస్ఈ పద్మారావు తెలిపారు. గుండ్లవాగు చెరువులో చేపట్టిన అభివృద్ధి పనుల్లో తోడిన మట్టి తో రైతులు ఇబ్బంది పడుతున్నారని గోవిందరావుపేట ఎంపీపీ సమస్యను సభ దృష్టికి తీసుకురాగా, పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలపై పర్యవేక్షణ లేదు జిల్లా పరిధిలో 18 ప్రాజెక్టుల్లో4,563 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా... అధికారుల పర్యవేక్షణ కరువైందంటూ జెడ్పీటీసీ లు, ఎంపీపీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీల్లో గుడ్లు, పాలు సక్రమంగా సరఫరా కావడం లేదని, వచ్చే కొద్ది మొత్తం పక్కదారి పడుతోందని ఆరోపించారు. పంచాయతీరాజ్ పరిధిలో 29 అంశాలను పర్యవేక్షించే అధికారం జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ఉందని.... ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎంపీపీలు విచారణ చేసి నివేదికను జిల్లా యం త్రాంగానికి పంపింతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదులిచ్చారు. అలాగే, చాలా రోడ్లు అధ్వానంగా మారాయని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. భూపాలపల్లి-పరకాల రోడ్లు నిర్మించిన ఏడాదికే గోతుల మయంగా మారి ప్రమాదాలకు నెలవైందని, సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించాలంటూ ప్రజాప్రతినిధులు కోరారు. ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తున్నందున, వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను జెడ్పీ చైర్పర్సన్ ఆదేశించారు. తీర్మానాలివే... జిల్లా పరిషత్ మొదటి సర్వ సభ్య సమావేశం పలు తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. రైల్వే వ్యాగ న్ వర్క్‌షాప్ నిర్మాణానికి భూ కేటాయింపు, కమలాపురం బిల్ట్ కర్మాగారం పునరుద్ధరణ, జిల్లా పరిధిలోని 2, 295 కిలోమీటర్ల పీఆర్ రోడ్లను రహదారులు, భవనాల శాఖ పరిధిలోకి మార్చడం, గ్రామీణ వరంగల్ డివిజన్లో ఉన్న సూపరింటెండెంట్ పోస్టును జెడ్పీ ఉద్యోగితో భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలి... 13వ ఆర్థిక సంఘంతోపాటు ఇతర నిధులన్ని కలిపి మొత్తం రూ.12.26 కోట్లతో చేపట్టే పనుల ప్రతిపాదనలు జెడ్పీటీసీల నుంచి తీసుకోవాలని తీర్మానిం చారు. సమావేశంలో ఎంపీలు గుండు సుధారాణి, కడియం శ్రీహరి, ఆజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, దొంతి మాధవరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి, శంకర్‌నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. మాకు అవకాశం ఇవ్వరా ? జిల్లా పరిషత్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎం పీ, ఎమ్మెల్యేల వాదోపవాదాలకు వేదిక కావడంపై జెడ్పీటీసీ, ఎంపీపీలు ఆగ్రహం వ్యక ్తం చేశారు. అన్ని విషయాలను ఎంపీలు, ఎమ్మెల్యేలే మాట్లాడితే క్షేత్రస్థాయిలో ఉండే తమకు అవకాశం లేకుండా పోతోందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కమలాపురంలోని బిల్ట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఎంపీ సీతారాంనాయక్ తీర్మా నం ప్రవేశపెట్టాలని జెడ్పీ చైర్పర్సన్ పద్మను కోరారు. తీర్మానం చేస్తే ఏం లాభమని... అసెంబ్లీ లేదా పార్లమెం ట్లో తీర్మానం చేసి సాధించాలని ఎంపీకి సభ్యులు సూచించారు. నల్లబెల్లి మండలం కన్నారావుపేట పరిధిలోని సర్వే నెం.58లో లాటరైట్ మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిందని జెడ్పీ వైస్‌చైర్మన్ మురళి తెలిపారు. 230 ఎకరాల ఈ భూమిని గతంలో సీలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగించగా, ఎస్సీలకు అసైన్డ్ చేశారన్నారు. అదే భూమిలో ఇప్పుడు మైనింగ్‌కు ఎలా అనుమతిచ్చారంటూ మైనింగ్ అధికారిని నిలదీశారు. లీజు పొందామని మైనింగ్‌కు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకున్న 21మంది ఎస్సీలపై నర్సంపేట డీఎస్పీ కేసులు నమోదు చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై మరోసారి సర్వే నిర్వహించాలని కలెక్టర్... మైనింగ్ ఏడీని ఆదేశించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు ప్రత్యేక మైకులు ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీలు పులుసం సరోజన, వంగాల యాకమ్మ, పరకాల ఎంపీపీలు సీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జెడ్పీ ఫ్లోర్ లీడర్లు తరచుగా మైకులు తీసుకోవడంపై మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడ్వాయి జెడ్పీటీసీ సరోజన మాట్లాడుతూ పస్రా-తాడ్వాయి-ఏటూరునాగారం జాతీయ రహదారి, లింగాల రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఆర్అండ్బీ ఎస్ఈ మోహన్‌నాయక్‌ను కోరారు. ఏటూరునాగారం వైద్యశాలలో వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని జెడ్పీటీసీ వలియాబీ కోరారు. దళితులకు భూపంపిణీలో భాగంగా అధికారులు, దళారులు కుమ్మక్కయ్యారని నర్సింహులపేట జెడ్పీటీసీ వేణు ఆరోపించా రు. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక, భూమి కొనుగోలు విషయాలపై అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు సమాచారం అందించేలా అధికారులను ఆదేశిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్లు సకినాల శోభన్, మూలగుండ్ల వెంకన్న, మోటపోతున్న శివశంకర్, ఎంపీపీ మార్నేని రవీందర్రావు పాల్గొన్నారు. -
డీలర్ల గుప్పిట్లో యూరియా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : యూరియా కేటాయింపుల్లో జిల్లా అధికార యంత్రాంగం జిమ్మిక్కులు చేస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి ప్రైవేటు డీలర్లకు అధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లాకు వచ్చిన యూరియాలో 50 శాతం నిల్వలను సహకార సంఘాలకు కేటాయించి వాటి ద్వారా విక్రయాలు చేపట్టాలి. అలా చేస్తేనే ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకుండా చాలా మట్టుకు అడ్డుకట్ట వేయవచ్చు. కానీ ప్రైవేటు డీలర్లతో వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా యూరియా నిల్వలను ప్రైవేటు డీలర్లకే కట్టబెడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 సహకార సంఘాలున్నాయి. కానీ పాత బకాయిల పేరుతో 20 సహకార సంఘాలకు అధికారులు ఒక్క బస్తా కేటాయించలేదు. పైగా రైతుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్ యూరియాను ప్రైవేటు డీలర్లకు కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మార్క్‌ఫెడ్‌కు కేటాయించిన నిల్వల నుంచి కూడా అధికారులు కొందరు ప్రైవేటు డీలర్లకే కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. తీవ్రమవుతున్న యూరియా కష్టాలు ఈ ఖరీఫ్ సీజన్లో 89,513 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కేటాయింపులు జరపాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ.. ప్రభుత్వం కేవలం 62,068 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది. ఆగస్టుకు సంబంధించి 35,112 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అవసరమని గుర్తించగా.. ఇప్పటివరకు 9,470 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా వచ్చింది. ఈ యూరియా నిల్వల్లో అధిక భాగం డీలర్ల గుప్పిట్లోకి చేరడంతో అన్నదాతల ఎరువు కష్టాలు తీవ్ర రూపం దాల్చుతోంది. అదనపు దోపిడీ ఒక్కో బస్తా రూ.284 చొప్పున విక్రయించాల్సి ఉండగా.. అదనంగా రూ.50 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే స్టాకు లేదని సాకు చెబుతున్నారు. ఇటీవల బేల మండల కేంద్రంలో ఓ డీలరు రూ.350కు తక్కువ విక్రయించేది లేదని తేల్చిచెప్పడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. విచారణ చేపట్టిన అధికారులు సదరు డీలరుకు నోటీసులతో సరిపెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. డిమాండున్నా వేధిస్తున్న కొరత.. జిల్లాలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. రెండు మూడురోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పత్తి, వరి, కంది, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు రైతులు యూరియా వేస్తున్నారు. దీంతో పెరిగిన డిమాండ్ మేరకు జిల్లాలో యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు యూరియా కష్టాలపై అధికారులను నిలదీశారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఈ యూరియా కేటాయింపులపై విచారణ జరిపితే అక్రమాలు వెలుగుచూసే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.