హర్షకుమార్ దిష్టిబొమ్మ దహనం
Published Sun, Oct 6 2013 2:22 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM
పాలకొండ, న్యూస్‌లైన్: రాజమండ్రిలో సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్న ఎన్జీవోలపై అమలాపురం ఎంపీ హర్షకుమార్ కుమారులు దాడి చేయడాన్ని నిరసిస్తూ పాలకొండ డివిజన్ సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. పోలీస్‌స్టేషన్ ఎదుట శనివారం రాత్రి రాస్తారోకో నిర్వహించారు. హర్షకుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం హర్షకుమార్ దిష్టిబొమ్మను దహ నం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు గున్ను రామ్మోహనరావు, జి.విజయభాస్కర్, ఎస్‌వీప్రసాదరావు, బలివాడ శ్రీనివాసరావు, బత్తిన మోహనరావు, ఎం.సంపత్‌కుమార్, సిరిపురపు శ్రీనివాసరావు, దన్నాన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
భామిని: సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏపీ ఎన్జీవో సంఘ ప్రతినిధులపై దాడి చే సిన అమలాపురం ఎంపీ హర్షకుమార్ కుమారులపై క్రిమినల్ కే సులు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి బత్తిలి ట్రెయినీ ఎస్‌ఐ నగిరెడ్డి లక్ష్మణరావుకు ఫిర్యాదు అందజేశారు. ఎస్‌ఐని కలిసిన వారిలో వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు గెల్లంకి రమేష్, కాంగ్రెస్, టీడీపీ నాయకులు తోట సింహాచ లం, వడ్డి గోవింద తమ్మిరెడ్డి షన్ముఖరావు, ఉపసర్పంచ్ కొవ్వూరు శేఖర్, పరిరక్షణ సమితి కన్వీనర్ ఎం.ప్రఫుల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement