పంచాయితీ చేశారు ! | Have proof! | Sakshi
Sakshi News home page

పంచాయితీ చేశారు !

Mar 6 2014 3:03 AM | Updated on Sep 2 2017 4:23 AM

ప్యాలకుర్తి గ్రామంలో పాపానికి వెల కట్టారు.

కోడుమూరు,  ప్యాలకుర్తి గ్రామంలో పాపానికి వెల కట్టారు. గ్రామంలో మతిస్థిమితంలేని మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడుతూ నాలుగు నెలల గర్భవతిని చేశాడు. ఈ నెల 3వ  తేదీన విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు కనుగొని చితకబాదారు.

గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఐదారు నెలలుగా మతిస్థిమితంలేని మహిళ ఇంట్లోకి ఎవరూలేని సమయంలో చొరబడి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. కాగా ఈ మహిళకు పదేళ్ల క్రితం వెల్దుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఆమెకు కుమార్తె ఉంది. మతిస్థిమితం సరిగా లేదని భర్త వదిలేయడంతో కుటుంబసభ్యులు చేరదీశారు.

 

నిరుపేద వర్గానికి చెందిన కుటుంబ సభ్యులంతా పనులకు వెళితే మతిస్థిమితంలేని మహిళ ఇంటి దగ్గరే ఉండేది. ఈ విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి మహిళపై రోజు అత్యాచారానికి పాల్పడేవాడు. ప్రస్తుతం గర్భం తొలగించడానికి, ఇతరత్రా ఖర్చులకు రూ. 70 వేలు ఇచ్చేవిధంగా గ్రామ పెద్దలు పంచాయితీ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ బాధితులు పోలీసు స్టేషన్‌కు రానప్పుడు తామెందుకు తలదూర్చాలని తెలియనట్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement