సాక్షి, కర్నూలు : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ పరి వాహక ప్రాంతమైన జూరాల నుంచి 8,82,690 క్యూసెక్కుల వరదనీరు విడుదల కాగా మొత్తంగా శ్రీశైలం డ్యామ్‌కు 9,26,632 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 8,81,028 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879.30 అడుగులకు నీటిమట్టం చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 184.7062 టీఎంసీలకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment