ఇంజినీరింగ్‌తో సమానంగా సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసిన వారికి అమెరికాలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని హైదరాబాద్‌లోని ఆమెరికన్ కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి ఏప్రిల్ వెల్స్ అన్నారు.
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్‌తో సమానంగా సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసిన వారికి అమెరికాలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని హైదరాబాద్‌లోని ఆమెరికన్ కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి ఏప్రిల్ వెల్స్ అన్నారు. బుధవారం ఉదయం ఆమె ఏయూను సందర్శించి వర్సిటీ వీసీ జి.ఎస్.ఎన్.రాజుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏయూ అందించే కోర్సుల వివరాలను ఆమె తెలుసుకున్నారు. విభిన్న శాస్త్రాలలో అత్యధికంగా యూజీ, పీజీ కోర్సులను నిర్వహించడాన్ని అభినందించారు. సార్క్ అధ్యయన కేంద్రం ద్వారా జరుగుతున్న సమకాలీన అంశాల పరిశోధనలపై ఆరా తీశారు.
ఏయూ విద్యార్థులకు అమెరికా వీసా పొందే విధానంపై త్వరలో అవగాహన కార్యక్రమం చేపడతామన్నారు. తద్వారా విద్యార్థులను సిద్దం చేయడానికి వీలవుతుందన్నారు. సామాజిక శాస్త్రాల్లో ఉన్నత విద్య పరిశోధనలు జరిపే భారతీయ విద్యార్థులకు అమెరికాలో అందించే స్కాలర్‌షిప్‌లు తదితర అంశాలను వివరించారు. ఇంజినీరింగ్‌తో సమానంగా సామాజిక శాస్త్రాలను సైతం బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నామని వీసీ రాజు చెప్పారు.
అమెరికన్ కాన్సులేట్‌తో కలసి విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ కల్చరల్ ఎఫైర్స్ అడ్వైజర్ సలీల్ కదీర్, ఏయూ రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.