సంక్షోభ హాస్టళ్లు
సంక్షేమ హాస్టళ్లు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల సాంబారుతో కాలం వెల్లబుచ్చాల్సి వస్తోంది. కొన్నిచోట్ల హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల ఇరుకు గదుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నెలనెలా ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు సైతం అందడం లేదు. విద్యార్థినుల హాస్టళ్లకు ప్రహరీ గోడలు లేకపోవడంతో ఆకతాయిల బెడద తప్పడం లేదు. వార్డెన్లు అందుబాటులో ఉండడం లేదు. మొత్తానికి జిల్లాలోని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేక సంక్షేమ హాస్టళ్లు కాస్తా.. సం‘క్షోభ’హాస్టళ్లుగా మారాయి.
తిరుపతిః జిల్లాలో హాస్టళ్లు.. నరకానికి నకళ్లుగా మారాయి. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తిరుపతి ఎస్సీ బాలుర హాస్ట ల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. బీసీ బాలికల హాస్టల్ భవనం అధ్వానంగా ఉంది. నగరంలోని అన్ని మరుగుదొడ్లు కొంపుకొడుతున్నాయి. విద్యార్థులకు సరిప డా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. వీటికి తలుపులు లేవు. కాస్మొటిక్ చార్జీలు చాలా వరకు అందలేదు.
చంద్రగిరి నియోజకవర్గంలో పలు హాస్టళ్లకు ప్రహరీ గోడలు లేవు. నెరబైలు, పుది పట్ల, పాకాలలోని ఎస్సీ బాలుర హాస్ట ల్స్ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది.మదనపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా అన్ని హాస్టల్స్‌లో తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలే అధికంగా ఉన్నా యి. పలు చోట్ల మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో తేడాలు కన్పించాయి. }M>-âహస్తి నియోజకవర్గంలో పలు హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తాగునీరు, అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లు వంటి సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు.
పలమనేరు నియోజకవర్గంలో 10 హాస్ట ల్స్ ఉన్నాయి. 4 పక్కాభవనాలు, 6 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పలు హాస్టల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం వస్తే కొన్ని ఉరుస్తున్నాయి.సత్యవేడు బీసీ బాలుర హాస్టల్‌కు తలుపులు లేవు. భద్రతా సిబ్బంది లేదు. వార్డెన్ అందుబాటులో ఉండరు. దీంతో పగటి పూట పశువులు లోనికి ప్రవేశించి పిల్లల పాఠ్య, నోటుపుస్తకాలను తినేస్తున్నాయి. కాస్మొటిక్ చార్జీలు 3నెలలు నుంచి ఇవ్వలేదు. ఎన్‌రోల్‌మెంట్‌కు అనుగుణంగా విద్యార్థులు లేరు. పూతలపట్టు నియోజకవర్గంలో పలు హాస్టళ్ల నిర్వహణ లోపంతో అపరిశుభ్రత కు ఆలవాలంగా మారాయి. విద్యార్థుల కు మెనూ ప్రకారం భోజనం అందడంలేదు. బంగారుపాళెం యాదమరి, ఐరాలలోని బాలికల ఎస్సీ హాస్టల్స్‌కు ప్రహరీగోడ లేకపోవడం తో ఆకతాయిల బెడదతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని అన్ని హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అన్నీ పాత భవనాలు కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.పీలేరులో హాస్టల్‌లలో మౌలిక వసతులు కొరవడ్డాయి. మరుగుదొడ్లు నిర్వహణ అటకెక్కింది. పీలేరు, గ్యారంపల్లె హాస్ట ల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి.గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పలు హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మెనూ ప్రకారం వడ్డిస్తున్నా భోజనంలో నాణ్యత కొరవడింది. చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాయి. కొన్ని హాస్టల్‌లలో వార్డెన్లు అందుబాటు లో లేరు. తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో ట్యూటర్లు రాకుండా ఎగ్గొడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. కలెక్టర్ బంగళా వెనుక ఉన్న హాస్టల్‌లో అన్నీ స మస్యలే. పాముల బెడద కూడా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.