కుక్కునూరు: పోలవరం నిర్వాసిత గ్రామాలైన రామన్నగూడెం, అర్వపల్లి, మొద్దులగూడెం తదితర గ్రామాల గిరిజన నిర్వాసితుల కుటుంబాలకు, ఏ కుటుంబానికి ఏ ఇళ్లు ఇస్తున్నారో, ఆ ఇళ్లను మంగళవారం అధికారులు చూపించారు. రామన్నగూడెం గ్రామానికి చెందిన 93, అర్వపల్లి గ్రామానికి చెందిన 202, మొద్దులగూడెం గ్రామానికి చెందిన 41 గిరిజన కుటుంబాలకు రావికుంట గ్రామంలో పునరావాస కాలనీలను నిర్మిస్తున్నారు. అయితే ఆయా కుటుంబాల్లో ఎవరికి ఏ ఇళ్లు ఇస్తున్నారో చూపించాలని గిరిజన నిర్వాసితులు పలుమార్లు అధికారులను అడిగిన నేపథ్యంలో, మంగళవారం ఎవరికి ఏ ఇళ్ల స్థలాన్ని ఇస్తున్నారో రెవెన్యూ అధికారులు చూపించారు. దీంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment