సీమాంధ్ర నాయకులు వచ్చిన తెలంగాణను అడ్డుకుంటూ తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని టీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.
ఓదెల, న్యూస్‌లైన్ : సీమాంధ్ర నాయకులు వచ్చిన తెలంగాణను అడ్డుకుంటూ తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని టీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాంసానిపల్లెలో తెలంగాణ రాదనే బెంగతో శనివారం ఆత్మహత్య చేసుకున్న నల్లాల రవి మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. రవి తల్లిదండ్రులను ఓదార్చి, వారిని ఆదుకుంటామన్నారు.
ఇప్పటికే వెయ్యి మందికిపైగా తెలంగాణ బిడ్దలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ఇంకెంత మందిని బలితీసుకుంటారని ప్రశ్నించారు. వెంటనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆందోళనలకు తెరదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట సర్పంచులు కునారపు రేణుకదేవి, తుంగాని సాయిలు, మాజీ ఎంపీటీసీలు ముంజాల రాజేశం, ఈరవేని శంకర్, నాయకుడుగుండేటి ఐలయ్యలు ఉన్నారు.