పాలకొల్లు, న్యూస్‌లైన్ : కత్తిపీటతో పీక కోసి భార్యను కిరాతకంగా హతమార్చిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5న ఆచంట కొత్తూరులో గోరుగంతు సూర్యవల్లీ గాయత్రి(30)ని భర్త ఉమాశంకర్ హత్య చేసి పరారైన విషయం పాఠకులకు విధితమే.
భార్యను హతమార్చిన భర్త అరెస్ట్
Oct 12 2013 2:41 AM | Updated on Sep 1 2017 11:34 PM
పాలకొల్లు, న్యూస్‌లైన్ : కత్తిపీటతో పీక కోసి భార్యను కిరాతకంగా హతమార్చిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5న ఆచంట కొత్తూరులో గోరుగంతు సూర్యవల్లీ గాయత్రి(30)ని భర్త ఉమాశంకర్ హత్య చేసి పరారైన విషయం పాఠకులకు విధితమే. ఈ కేసుకు సంబంధించినిందితుడిని శుక్రవారం పట్టుకున్నారు. పాలకొల్లు సీఐ జీవీ కృష్ణారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనుమంట్రకు చెందిన ఉమాశంకర్ కు ఆచంట కొత్తూరుకు చెందిన గాయత్రితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది.
జుత్తిగ పోస్టాఫీస్‌లో పనిచేసే ఉమాశంకర్ పేకాట, క్రికెట్ బెట్టింగులకు అల వాటుపడ్డాడు. భార్యను ఆమె తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బు తీసుకురావాలంటూ తరచూ వేధించేవాడు. ఆమెపై అనుమానం పెంచుకుని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇటీవల మార్టేరులోని వనంపల్లిలో స్థలం కొనుగోలు చేయాలని, అందుకోసం రూ. 2.25 లక్షలు పుట్టింటి నుంచి తీసుకురావాలంటూ ఈ నెల 2న ఆచంట కొత్తూరు శ్రీపాదవారి వీధిలో ఆమెను దించి వెళ్లిపోయాడు.
ఈ నేపథ్యంలో గాయత్రి తల్లి 5వ తేదీన వేరే ఊరు వెళ్లగా విషయం తెలుసుకున్న ఉమాశంకర్ అదే రోజు మధ్యాహ్నం ఆచంట మామగారింటికి వచ్చాడు. మామ శ్రీపాద సూర్యనారాయణ బయటకు వెళ్లడంతో గాయత్రితో డబ్బులు విషయంలో గొడవపడ్డాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం పెరగడంతో భార్యను కత్తిపీటతో నరికి పారిపోయాడు. మృతురాలి తండ్రి సూర్యనారాయణ ఆచంట పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం రాత్రి మార్టేరు కాటన్ వారధి వద్ద ఉమాశంకర్‌ను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ చెప్పారు.
Advertisement
Advertisement