Umasankar
-
ఉగ్రవాదం.. దేశ విధానమా?!
వాషింగ్టన్ : అంతర్జాతీయంగా కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ విధానంగా మార్చుకున్నాయని ఐక్యరాజ్య సమితిలో భారత లీగల్ అడ్వైజర్ యెడ్ల ఉమాశంకర్ పేర్కొన్నారు. ఇటువంటి దేశాలను ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఆమె సమితికి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు ఆయుధాలను అందించి, సహకరిస్తున్నదేశాలు.. ఏదో ఒకరోజున వారు కూడా ఫలితం అనుభవిస్తారని చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడంపై జరిగిన చర్చలో ఉమాశంకర్ భారత ప్రతినిధిగా అభిప్రాయాలను వెలువరించారు. ఉగ్రవాదాన్ని నాశనం చేయాలంటే వారికి అందుతున్న మౌలిక వసతులను దెబ్బ కొట్టాలని.. అందులో ప్రధానంగా ఆర్థిక మూలాలను నాశనం చేయాలని పిలుపునిచ్చారు. భారత్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఉదుర్కొంటోందని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఉగ్రవాదులకు ఆర్థిక, ఆయుధ, ఇతర అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్న దేశాలను, వ్యక్తులపై టెర్రరిస్ట్ కేసులు పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె పాకిస్తాన్‌ను పరోక్షంగా టెర్రరిస్ట్ అడ్డా అని పేర్కొన్నారు. -
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కు మార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్– కొచువెలి ( 07115/07116) ప్రత్యేక రైలు ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 9 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 3.20కి కొచువెలి చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 13, 20, 27 మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 8.15కి కొచువెలి నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 3.30 గంటలకి నాంపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లకు ప్రత్యేక చార్జీలు వర్తిస్తాయి. సికింద్రాబాద్– కాకినాడ స్పెషల్ ట్రైన్... సికింద్రాబాద్–కాకినాడ (07101/07102) ప్రత్యేక రైలు ఈ నెల 31న సాయంత్రం 7.15కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15కి కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 2న సాయంత్రం 6.10కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
భార్యను హతమార్చిన భర్త అరెస్ట్
పాలకొల్లు, న్యూస్‌లైన్ : కత్తిపీటతో పీక కోసి భార్యను కిరాతకంగా హతమార్చిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5న ఆచంట కొత్తూరులో గోరుగంతు సూర్యవల్లీ గాయత్రి(30)ని భర్త ఉమాశంకర్ హత్య చేసి పరారైన విషయం పాఠకులకు విధితమే. ఈ కేసుకు సంబంధించినిందితుడిని శుక్రవారం పట్టుకున్నారు. పాలకొల్లు సీఐ జీవీ కృష్ణారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనుమంట్రకు చెందిన ఉమాశంకర్ కు ఆచంట కొత్తూరుకు చెందిన గాయత్రితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. జుత్తిగ పోస్టాఫీస్‌లో పనిచేసే ఉమాశంకర్ పేకాట, క్రికెట్ బెట్టింగులకు అల వాటుపడ్డాడు. భార్యను ఆమె తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బు తీసుకురావాలంటూ తరచూ వేధించేవాడు. ఆమెపై అనుమానం పెంచుకుని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇటీవల మార్టేరులోని వనంపల్లిలో స్థలం కొనుగోలు చేయాలని, అందుకోసం రూ. 2.25 లక్షలు పుట్టింటి నుంచి తీసుకురావాలంటూ ఈ నెల 2న ఆచంట కొత్తూరు శ్రీపాదవారి వీధిలో ఆమెను దించి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో గాయత్రి తల్లి 5వ తేదీన వేరే ఊరు వెళ్లగా విషయం తెలుసుకున్న ఉమాశంకర్ అదే రోజు మధ్యాహ్నం ఆచంట మామగారింటికి వచ్చాడు. మామ శ్రీపాద సూర్యనారాయణ బయటకు వెళ్లడంతో గాయత్రితో డబ్బులు విషయంలో గొడవపడ్డాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం పెరగడంతో భార్యను కత్తిపీటతో నరికి పారిపోయాడు. మృతురాలి తండ్రి సూర్యనారాయణ ఆచంట పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం రాత్రి మార్టేరు కాటన్ వారధి వద్ద ఉమాశంకర్‌ను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ చెప్పారు.