అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు.
అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘనట వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బి. కొత్త కోట ఆకుల వారి పల్లె కి చెందిన శంకర్ అనే వ్యక్తి భార్య అమరావతి ఈనెల 9న అదృశ్యం అయ్యింది.
భార్య కనిపించడం లేదంటూ శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమరావతి మృతదేహం గ్రామ సమీపంలోని పొలాంలో బయట పడటంతో.. శంకర్ గుట్టు రట్టైంది. అమరావతికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానమే.. హత్యకు కారణంమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.