'భూ పంపిణీపై సీఎంనే అడగండి'
హైదరాబాద్: నేపాల్లో పశుపతినాథ్ ఆలయ పునరుద్ధరణకు రూ. 2 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రెవెన్యూ శాఖలో సంస్కరణలను వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పాస్బుక్ల జారీలో ఆలస్యం జరుగుతుందన్నారు.
సర్వేయర్లు లేకపోవడం వల్ల ఆలస్యం జరుగుతుందని వెల్లడించారు. త్వరలోనే ఈపీఎస్ మిషన్లు ఏర్పాటు చేసి పాస్ పుస్తకాలను వేగంగా జారీ చేయిస్తామని చెప్పారు. భూ పంపిణీపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం చంద్రబాబునే అడగండి అంటూ కేఈ సమాధానమిచ్చారు. అయితే ఇప్పటి వరకు భూ పంపిణీపై ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని డిప్యూటీ సీఎం కేఈ తెలిపారు.