నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా: కేశినేని నాని | Iam stick with my words, says TDP MP kesineni nani | Sakshi
Sakshi News home page

‘నా తల పగిలినా కొండను ఢీకొట్టేందుకు సిద్ధం’

Published Wed, May 24 2017 3:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా: కేశినేని నాని - Sakshi

నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా: కేశినేని నాని

విజయవాడ: బీజేపీతో పొత్తువల్లే మెజార్టీ తగ్గిందన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి స్పష‍్టం చేశారు.  పొత్తు లేకుంటే టీడీపీకి మరింత మెజార్టీ వచ్చేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తనకు ముఖ్యమంత్రే అధిష్టానం అని... ఒకవేళ ఈ అంశంపై అడిగితే వివరణ ఇస్తానని కేశినేని తెలిపారు.

తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, వాస్తవలే మాట్లాడానని ఆయన సమర్థించుకున్నారు. తల పగిలినా కొండను ఢీకొట్టేందుకు సిద్ధమని... తన కాన్ఫిడెన్స్‌ అలాంటిదని అన్నారు. కార్యకర్తల్లో ప్రేరణకోసమే అలా మాట్లాడానని, తాను పార్టీ సమావేశంలోనే మాట్లాడానని, బహిరంగ సభలో కాదని కేశినేని నాని పేర్కొన్నారు. ఇక పొత్తులు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement