ఇంటర్‌లో మాస్ కాపీయింగ్ | In the inter-mass copying | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో మాస్ కాపీయింగ్

Published Sat, Mar 21 2015 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

In the inter-mass copying

ఇన్విజిలేటర్ల మాయాజాలం
నిబంధనలకు తిలోదకాలు
 చీఫ్ సూపరింటెండెంట్‌ను నిలదీత

 
నర్సీపట్నం:  బాలికల గురుకుల కళాశాలలో మాస్ కాపీయింగ్ జరుగుతోందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ చంద్ర శారదను శుక్రవారం నిలదీశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇన్విజిలేటర్లను నియమించి మాస్ కాపీయింగ్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కేంద్రంలో పట్టణంలోని రుషి,  డాన్‌బాస్కో, ప్రభుత్వ బాలికల, బాలుర, రవితేజ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, మోడల్  కళాశాలలకు చెందిన 520 మంది విద్యార్థులు ఇంటర్  పరీక్షలు రాస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయా కళాశాలలకు చెందిన అధ్యాపకులను పరీక్షా కేంద్రంలో ఇన్విజలేటర్లుగా నియమించ కూడదు. నిబంధనలకు తిలోదకాలిస్తూ పరీక్షా కేంద్రం నిర్వాహకులు రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులను ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నారు. ఈ పరీక్షా కేంద్రంలో రాజేంద్రప్రసాద్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాస్తున్నారు. రోజు తప్పించి రోజు మొదట, రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సర ం పరీక్ష రోజున మాత్రమే ఆ కళాశాలకు చెందిన అధ్యాపకులను ఇన్విజలేటర్లుగా వేస్తున్నారు.

పరీక్షా కేంద్రంలో ఇద్దరు ఇన్విజిలేటర్లు వారి విద్యార్థులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడంపై మిగిలిన కళాశాలలకు చెందిన విద్యార్థులు వారి యాజమాన్యాల వద్ద మొరపెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన ఫిజిక్స్ పరీక్షకు  రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన ఫిజిక్స్ అధ్యాపకులు రవికిరణ్, వెంకట్‌ను ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఈ విషయం తెలుసుకుని మిగిలిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు  పరీక్షా కేంద్రానికి వెళ్లి కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ చంద్ర శారదను నిలదీశారు. ఆమెతో వాదనకు దిగారు. రాజేంద్రప్రసాద్ కళాశాల అధ్యాపకులను నియమించలేదని, శ్రీసాయి కళాశాలకు చెందిన అధ్యాపకులను ఇన్విజలేటర్లగా నియమించానని  చీఫ్ సూపరింటెండెంట్ చెప్పుకొచ్చారు. ఇద్దరు అధ్యాపకులు రాజేంద్రప్రసాద్ కళాశాలకు చెందిన వారని,  శ్రీసాయి కళాశాల పేరుతో ఇన్విజిలేషన్ వేయించుకుంటున్నారని పరీక్షలు ప్రారంభంలోనే మీ దృష్టికి తీసుకువచ్చామన్నారు. మీ ప్రోత్సాహంతోనే ఇలా జరుగుతుందని వారు ఆరోపించారు.  రాజేంద్రప్రసాద్ కళాశాలకు  చెందిన అధ్యాపకులు అనే  విషయం తనకు తెలియదని, ఇప్పుడే విధులనుంచి తొలగిస్తానని చీఫ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు.   ఈ విషయమై ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐవోకు ఫిర్యాదు చేస్తామని నాయుడు,  విల్సన్, డి.బాబు, వి రాజులనాయుడు పేర్కొన్నారు.

దీనిపై చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశారదను వివరణ కోరగా లెక్చరర్లు సరిపోక నలుగురు టీచర్స్ కావాలని ఎంఈవోను రాతపూర్వకంగా కోరగా ఇద్దరు ఉపాధ్యాయులను మాత్రమే ఇచ్చారన్నారు. తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు కళాశాల అధ్యాపకులను ఇన్విజిలేటర్లగా నియమించానని తెలిపారు.  ఎంఈవో బీవీ రమణను వివరణ కోరగా గురుకుల కళాశాల చీఫ్ సూపరింటెండెంట్‌నుంచి ఎటువంటి లెటర్ రాలేదని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement