సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూతనిచ్చే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 1961 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద మినహాయింపు వర్తిస్తుందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి. ఉషారాణి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునే వారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ పేరుపై పంపాలని సూచించారు.
బ్యాంక్ ద్వారా పంపే వారు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్: 38588079208, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC కోడ్: SBIN001884
ఆంధ్రా బాంక్, అకౌంట్ నెంబర్: 110310100029039, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC CODE: ANDB0003079
కొనసాగుతున్న విరాళాలు
సీఎం రిలీఫ్ ఫండ్‌కు విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు వేతనం (రూ.5.30 కోట్లు) విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ ఉద్యోగులను మంత్రి బాలినేని శ్రీనివాస్ అభినందించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ లక్ష రూపాయల విరాళాన్ని గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధరరెడ్డికి అందజేశారు. జిల్లాలో కరోనా వైరస్ నిరోధానికి వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన కార్యాచరణ ను కలెక్టర్‌ను అడిగి ఆయన తెలుసుకున్నారు. (కరోనా బాధితులకు పవన్ కల్యాణ్ విరాళం)
రేపు కేబినెట్ ప్రత్యేక భేటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment