కర్నూలు(అర్బన్): సుదీర్ఘ విరామం తరువాత శుక్రవారం మండలాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. మండల పరిషత్ పాలకవర్గాలు 2011 జూలై 11వ తేదీ నుంచి రద్దయ్యాయి. నాటి నుంచి నేటి వరకు మండలాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించగా మే నెలలో ఫలితాలు వచ్చాయి. జిల్లాలో 53 మండలాలు ఉండగా ఇందులో ఇరవై రెండింటిలో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది.
తెలుగుదేశం పార్టీ 21 మండలాల్లో పట్టు సాధించగా మిగిలిన పదింటిలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతరులు కూడా ఆయా మండలాల్లోని పలు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఆ మండలాల్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయా స్థానాల్లో ఎలాగైన తమ అభ్యర్థులను మండలాధ్యక్షులుగా కూర్చోబెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ తన వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ సంధిస్తోంది.
తమ ఖాతాలోకి ఆయా స్థానాలను వేసుకునేందుకు ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ కూడా చేసింది. ఇదే విషయాన్ని కిడ్నాప్‌కు గురైన ఎంపీటీసీల బంధువులు జిల్లా ఎస్‌పీకి కూడా ఫిర్యాదు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎంపీటీసీలకు డబ్బును ఎరగా వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కూడా వెనుకాడడం లేదు.
టీడీపీకి మెజార్టీ ఉన్న మండలాలు: ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, పత్తికొండ, క్రిష్ణగిరి, తుగ్గలి, మద్దికెర, నందవరం, కౌతాళం, పాణ్యం, డోన్, బనగానపల్లె, అవుకు, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, గోస్పాడు, ఆత్మకూరు, మహానంది, వెలుగోడు.
హంగ్‌కు అవకాశం ఉన్న మండలాలు: వెల్దుర్తి, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, సి. బెళగల్, కల్లూరు, గడివేముల, బండిఆత్మకూరు, పాములపాడు, పగిడ్యాల
వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న మండలాలు..
ఆదోని, హాలహర్వి, హోళగుంద, గోనెగండ్ల, మంత్రాలయం, కోసిగి, పెద్దకడుబూరు, కర్నూలు, ఓర్వకల్లు, బేతంచెర్ల, ప్యాపిలి, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల, సంజామల, చాగలమర్రి, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, నంద్యాల, నందికొట్కూరు, కొత్తపల్లి, జూపాడుబంగ్లా, మిడ్తూరు.
నేడు ఎంపీపీల ఎన్నిక
Published Fri, Jul 4 2014 1:49 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement