తండ్రి అయిన చేతన్ ఆనంద్! | It’s a girl for Chetan Anand and Sarada Govardhini | Sakshi
Sakshi News home page

తండ్రి అయిన చేతన్ ఆనంద్!

Published Fri, Dec 13 2013 3:13 PM | Last Updated on Sat, Jun 2 2018 2:30 PM

తండ్రి అయిన చేతన్ ఆనంద్! - Sakshi

తండ్రి అయిన చేతన్ ఆనంద్!

హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య శారదా గోవర్ధిని ఈ నెల 8న ఆడపిల్లకు జన్మనిచ్చారు. 'డిసెంబర్ 8న నాకు పాప పుట్టింది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు' అని చేతన్ అన్నాడు. తనకు ఆడపిల్లే కావాలనుకున్నానని చెప్పాడు. దేవుడు తన కోరిక నెరవేర్చాడని, ఆయన ఎంతో రుణపడివున్నానని తెలిపాడు.

తన పుట్టినరోజునే కూతురు పుట్టడం అత్యంత సంతోషాన్ని ఇస్తోందని వెల్లడించాడు. ఇది యాధృచ్చికమైనా అత్యంత ఆనందాన్ని కలిగిస్తోందని అన్నాడు. ఈ పుట్టిన రోజున తన భార్య ఇచ్చిన కానుకగా వర్ణించాడు. తన కూతురు తమ జీవితంలోకి మరింత సంతోషాన్ని తీసుకొచ్చిందని వ్యాఖ్యానించాడు. తన కూతురిని మొదటిసారి ఎత్తుకున్నప్పుడు అర్వచనీయ అనుభూతి కలిగిందన్నాడు. తన ముఖంలో నవ్వులు పూశాయని పేర్కొన్నాడు. అయితే తన కూతురికి ఇంకా పేరు పెట్టలేదని చేతన్ ఆనంద్ తెలిపాడు. గుత్తా జ్వాలతో విడిపోయిన తర్వాత కిందటేడాది అక్టోబర్ 25న శారద గోవర్ధినిని చేతన్ పెళ్లాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement