ఐటీడీఏ పీవో సరెండర్? | ITDA PO Surrender | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ పీవో సరెండర్?

Published Sat, Jun 6 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

ITDA PO Surrender

సీతంపేట : ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి ఎన్.సత్యనారాయణను మాతృసంస్థ అయిన రెవెన్యూ శాఖకు సరెండర్ చేయనున్నట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కూడా పీవోను నాలుగైదు రోజుల్లో సరెండర్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈయన పనితీరు బాగోలేదని కొంతమంది నాయకులు పిర్యాదు చేసిన నేపథ్యంలో పీవోను సరెండర్ చేయనున్నట్టు తెలిసింది. ఈయన స్థానంలో విజయనగరం జిల్లాలో ఆర్డీవో పనిచేస్తున్న జె.వెంకటరావును నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు మంత్రి కూడా సుముఖంగా ఉన్నట్టు పక్షం రోజులుగా ఐటీడీఏలో చెప్పుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement