ఇది ఆరంభమే.. | It's the start | Sakshi
Sakshi News home page

ఇది ఆరంభమే..

Published Sat, Dec 6 2014 2:07 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

ఇది ఆరంభమే.. - Sakshi

ఇది ఆరంభమే..

రుణమాఫీపై వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు, డ్వాక్రా మహిళలు గళమెత్తారు. రుణమాఫీలో ప్రభుత్వ కప్పదాటు              వ్యవహారశైలిపై కలెక్టరేట్ ఎదుట   శుక్రవారం రెండున్నర గంటలు ధర్నా  నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  రుణమాఫీ జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడతామని, ఈ ధర్నా ఆరంభమేనని ఘంటాపథంగా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా వైఎస్సార్ సీపీ.. ప్రభుత్వం మెడలు వంచేందుకు సన్నద్ధమవుతోందన్నారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి వైఎస్సార్ సీపీ నేతల ప్రసంగాలు వారి మాటల్లోనే..
 - మచిలీపట్నం
 
జగన్ చెప్పిందే జరిగింది..

ఎన్నికల సమయంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని ప్రచారం చేస్తుంటే.. మనం కూడా అలాగే చేద్దామంటూ మేమంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరాం. అరుుతే, ఆయన నూతన రాష్ట్రంలో రుణమాఫీ చేయడానికి అవకాశాలు ఉండవు. ఆ మాఫీ ప్రజలను మోసం చేసినట్టే     అవుతుందన్నారు. ఇప్పుడు బాబు వ్యవహారశైలి చూస్తుంటే అప్పుడు జగన్ చెప్పిందే నిజమైందనిపిస్తోంది. దాళ్వా పంటకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటికీ చెప్పట్లేదు.
 - బూరగడ్డ వేదవ్యాస్,
 వైఎస్సార్ సీపీ పెడన సమన్వయకర్త
 
ప్రజల పక్షాన పోరు..

రుణమాఫీ జరిగే వరకు వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది. గ్రామ కమిటీల పేరుతో టీడీపీ ప్రభుత్వం అర్హులైన వారి పింఛన్లను తొలగిస్తోంది. రుణమాఫీలో అనేక అవాంతరాలు సృష్టిస్తూ కావాలనే కాలయాపన చేస్తోంది. డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ ఎలా చేస్తారో ఇంతవరకు స్పష్టం చేయలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుంది.
 - దూలం నాగేశ్వరరావు,
 వైఎస్సార్ సీపీ కైకలూరు నియోజకవర్గ
 నాయకుడు
 
హామీలన్నీ నెరవేర్చాలి..


టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా పెచ్చురిల్లుతోంది. డ్వాక్రా సంఘాలను గుప్పెట్లో    పెట్టుకుని ఇసుక మాఫియాను విస్తరింపజేసేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ ఏర్పాటుచేసిన గ్రామ కమిటీ సభ్యుల పనితీరుపై నిఘా ఉంచాలి. అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీలన్నీ నెరవేర్చాలి.     
 - సామినేని ఉదయభాను, వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట సమన్వయకర్త
 
బాబు వచ్చాడు.. జాబు పోయింది..

బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక చంద్రబాబుకు, దేవినేని ఉమామహేశ్వరరావుకు, కొల్లు రవీంద్రకు ఉద్యోగాలు వచ్చారుు. గృహనిర్మాణంలో పనిచేస్తున్న వర్క్ ఇన్         స్పెక్టర్లు, గ్రామాలు, వార్డుల్లో పింఛన్లు ఇచ్చే సీఎస్పీలు, ఆదర్శ రైతుల ఉద్యోగాలు పోయాయి. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రుణమాఫీపై ఆంక్షలు విధిస్తున్నారు.
 
 - పేర్ని వెంకట్రామయ్య (నాని), వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
 
ప్రజలను మోసం చేస్తున్నారు..


ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చని వారిని మోసగాడంటారు. రుణమాఫీపై అనేక ఆంక్షలు విధిస్తున్న చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు, హైదరాబాద్‌లో చాంబర్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, జపాన్ వెళ్లిన బృందంలో అంతా సారా వ్యాపారులే. రుణమాఫీ కోసం రూ.5వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నగదు రుణమాఫీకి సరిపోతుందో, లేదో లెక్క చెప్పలేదు.
 - గౌతంరెడ్డి, వైఎస్సార్ సీపీ
 విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త
 
అనాలోచిత నిర్ణయాలతో అవస్థలు


 ఎన్నికల సమయంలో అనాలోచిత నిర్ణయాలతో అమలుకాని హామీలు ఇచ్చారు. డ్వాక్రా రుణాలు ఎప్పుడు రద్దుచేస్తారో చెప్పట్లేదు. మాట ఇవ్వకుండానే వైఎస్ రుణమాఫీ అమలు చేశారు. రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారు.
 - దుట్టా రామచంద్రరావు,
 వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త
 
హామీలు నెరవేర్చేది ఎప్పుడు బాబూ?

రుణమాఫీకి ఈ ధర్నా ఆరంభమే. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసి ఐదు సంతకాలు చేశారు. వాటిలో ఏమేమి నెరవేర్చారో ప్రకటించాలి. ఈ ధర్నాకు బస్సులు రాకుండా ప్రైవేటు కళాశాలలు, కాన్వెంట్ల వద్దకు టీడీపీ నాయకులను పంపించి వారు బస్సులు ఇవ్వకుండా సంతకాలు చేరుుంచుకున్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తానన్నారు. బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామన్నారు. ఆరు నెలలు గడిచినా ఒక్క పనీ ప్రారంభం కాలేదు. ప్రజల కష్టాలను వదిలేసి ఎంత దోచుకుందామనే ధోరణితో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.
 - జోగి రమేష్,  వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త
 
 ప్రజలు రాళ్లతో కొడతారు..

 ఎన్నికల సమయంలో వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టేశారు. రుణాలు మాఫీ చేసేందుకు రైతుల వివరాలు సేకరిస్తూ కాలయాపన చేస్తున్నారు. తుపాను, రాజధాని నిర్మాణం తదితర అంశాలను తెరపైకి తెచ్చి ఆ అంశాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలే పాలకులను రాళ్లతో కొడతారు.
 - ఉప్పులేటి కల్పన, శాసనసభ ఉప ప్రతిపక్ష నేత,
 పామర్రు ఎమ్మెల్యే
 
 సహనంతో ఉన్నాం..

 అధికారం చేతిలోకి రాగానే టీడీపీ కార్యకర్తలు రెచ్చి           పోతున్నారు. దౌర్జన్యాలకు దిగుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సహనంతో ఉంటున్నారు. టీడీపీ ఇదే పద్ధతి కొనసాగిస్తే విజయవాడలోని సీపీ,  కలెక్టర్ ఇంటి వద్ద ధర్నా చేస్తాం. టీడీపీ హామీలు అమలు చేయకపోతే ఉద్యమాలు తప్పవు. మంత్రులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు.ఈ నెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రుణమాఫీపై ప్రతిపక్షం నిలదీస్తుందనే భయంతోనే సీఎం మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 - జలీల్‌ఖాన్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే
 
 అన్నీ అబద్ధపు హామీలే..

 రుణమాఫీ సాధ్యం కాదని తెలిసినా అబద్ధపు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రుణమాఫీ చేస్తానని ఒక్క అబద్ధం ఆడి ఉంటే.. నేడు మా పార్టీనే అధికారంలో ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ జరిగింది. ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. చంద్రబాబు రుణమాఫీపై తొలి సంతకం చేసినా నేటికీ అమలు చేయలేదు.
 - కొక్కిలిగడ్డ రక్షణనిధి, తిరువూరు ఎమ్మెల్యే
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement