హైదరాబాద్ : ఏపీలో అవినీతి, దుబారా పెరగడం వల్లే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు అన్నారు. ప్రత్యేక హోదాను వదిలి పెట్టింది సీఎం చంద్రబాబు నాయుడే అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం వల్లే టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడని టీడీపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.
ప్యాకేజీ కింద వచ్చే డబ్బు రాజధాని ప్రాంతానికే పరిమితం చేస్తున్నారని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనకబడిన ప్రాంతాలని, వాటి అభివృద్ధికి ఇచ్చిన నిధులను ఆ ప్రాంతాలకే ఖర్చు చేయాలని సూచించారు. ప్యాకేజీ కింద ఇస్తామన్న నిధులపై ఓ స్పష్టత లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఎంత అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఇచ్చిన నిధులకు సరైన లెక్కలు రాలేదని కేంద్రం అంటోందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లెక్కలు చూపాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment