ఐవైఆర్ కృష్ణారావు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ట్విటర్ వేదికగా తన దైన శైలిలో ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినకు పోవటం, రావటం జరిగిందని, కానీ ప్రజలకు కలిగిన అనుమానాలను తీర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రుణ సేకరణ సామర్థ్యం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితుల నుంచి మినహాయింపునివ్వాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. కేంద్రం దానికి అంగీకరించి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ) ఏర్పాటు చేసుకోవాలని సూచించిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌పీవీ ఏర్పాటు చేసి కేంద్రం నుంచి రావల్సిన 16 వేల కోట్లు రాబట్టుకుంటుందా లేక కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే దాక ఏ నిధులు తీసుకోమిన భీష్మించుకొని కూర్చుంటుందా వేచి చూడాలన్నారు. తన ఉద్దేశం ప్రకారం ఎస్‌పీవీ ఏర్పాటు చేసుకొని నిధులను సాధించి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా ఉద్యమించడమే ఉత్తమమని కృష్ణారావు సూచించారు.
మరిఎస్.పీ.వీ.ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి రావలసిన 16 వేల కోట్లు రాష్ట్రం రాబట్టుకుంటుందా లేక ప్రత్యేక హోదా ఇచ్చిన దాకా ఏమీ ముట్టము అని భీష్మించుకొని కూర్చుంటుందా.నా దృష్టిలోఎస్.పీ.వీ. ఏర్పాటుచేసుకుని నిధులను సాధించి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా ఉద్యమించడమే ఉత్తమం.
— IYRKRao , Retd IAS (@IYRKRao) 20 June 2018
Comments
Please login to add a commentAdd a comment