బట్టబయలైన ‘బాబు’ నైజం | Jakkampudi Vijayalakshmi fire on Chandra Babu Naidu | Sakshi
Sakshi News home page

బట్టబయలైన ‘బాబు’ నైజం

Published Wed, Jun 20 2018 7:17 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

Jakkampudi Vijayalakshmi fire on Chandra Babu Naidu - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: ఎన్నికల్లో ఓట్ల కోసమే తప్ప ప్రజలు, సామాజిక వర్గాల కోసం సీఎం చంద్రబాబు ఏ పనీ చేయడన్న విషయం సోమవారం రాష్ట్ర సచివాలయం వద్ద మరోమారు బయటపడిందని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు, రాజానగరం కో ఆర్డినేటర్‌ జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ వాస్తవంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాలయాల్లోని కేశ ఖండనశాలల్లో పని చేసే నాయి బ్రాహ్మణులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళితే వారిని నోటికొచ్చినట్లు మాట్లాడి భయపెట్టిన చంద్రబాబుకు బుద్ధిలేదని మండిపడ్డారు. ఈ ఘటనతో సామాన్యులు, శ్రామికుల పట్ల ఆయన బుద్ధి భేమిటో తేటతెల్లమవుతోందన్నారు. 

ఓటమి భయంతోనే అసహనం
తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు భారీగా ప్రజలు వచ్చి, సమస్యలు చెప్పుకుంటుండడంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందని విజయలక్ష్మి అన్నారు. 2014 ఎన్నికల్లో కులాల వారీగా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయని చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఈ వయస్సులో ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్‌ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించి, 

ఆ తర్వాత తాను చెప్పినట్లు చేయకపోవడంతో అవమానకరంగా  పదవి నుంచి దింపారని గుర్తు చేశారు. తిరుపతిలో చంద్రబాబు చేసిన ఘన కార్యాలను బయటపెట్టిన ప్రధానార్చకులు రమణను తొలగించారన్నారు. తనకు అనుకూలంగా, తన కుమారుడు లోకేష్‌కు ముడుపులు ఇచ్చే వారికే పదవులు, కాంట్రాక్టులు ఇస్తూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గోముఖవ్యాఘ్రం లాంటి వాడని విమర్శించారు. ‘మీకిది ఇస్తే నాకేం’టని ఆలోచించే చంద్రబాబు జీవితం అంతా అవినీతిమయమని ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement