Jakkampudi Vijayalakshmi
-
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు
-
దోచుకొని దాచుకున్న మీరా విమర్శించేది?
సాక్షి, కోరుకొండ (రాజానగరం): గత టీడీపీ ప్రభుత్వంలో దొరికినంత దోచుకొని దాచుకున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కోరుకొండ శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కళావేదిక పై ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ చేస్తున్న అసత్య ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఒక్కరికి ఓటు వేస్తే ముగ్గురం నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తామని ఆనాడే చెప్పామన్నారు. మా కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని నన్ను నా పిల్లలు దేవతగా కొలుస్తారని, నా మాటను శాసనంగా భావిస్తారని అన్నారు. తన కుటుంబంపై వెంకటేష్ తరుచూ ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఇసుక, మట్టి దోచుకోవడం, ధనార్జనే థ్యేయంగా పనిచేయడంతోనే టీడీపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన మీకు ప్రజలు గుణపాఠం చెప్పార న్నారు. మీరు గాలివాటున రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. గతంలో మీ సతీమణి అన్నపూర్ణకు టీడీపీ ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిపోయారని, మరోసారి ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకుండా మీరు ఎలా లాక్కున్నారో అందరికి తెలుసు అన్నారు. స్వచ్ఛ కోరుకొండ కార్యక్రమంలో గ్రామ వలంటీర్లు పాల్గొంటున్నారని దానిని మాజీ ఎమ్మెల్యే రాజకీయం చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో దోమలపై దండయాత్ర, వనం–మనం కార్యక్రమంలో ప్రభుత్వాధికారులను, విద్యార్థులను ఎలా ఉపయోగించుకున్నారో మీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు. సీతానగరం మండలంలో ఇసుక దోపిడీ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించడానికి వెళ్లిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులపై మీ ప్రోత్సాహంతోనే దాడిచేసిన సంఘటన అందరికీ తెలిసిందేనని అన్నారు. కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతిని ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తీసుకువచ్చారన్నారు. దానిని కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, లేకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల నాయకులు తిరుమలశెట్టి సత్యనారాయణ, నక్కా రాంబాబు, బొరుసు బద్రి, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి తాడితోట (రాజమహేంద్రవరం ) : వైద్య విధానపరిషత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిని సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతానన్నారు. ఈ సంఘం వైఎస్సార్ సీపీ టీయూసీకి అనుబంధంగా పని చేస్తుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కమిటీలను ఎన్నుకున్నారు. ఎన్నికకు వైఎస్సార్ సీపీ టీయూసీ తరఫున ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జి మస్తానప్ప ఎన్నికల పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. -
జత కట్టినప్పుడు గుర్తుకు రాలేదా బాబూ!
మధురపూడి (రాజానగరం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో ముఖ్యమంత్రి చంద్రబాబు జతకట్టినప్పుడు గుర్తుకురాలేదా, ఇప్పుడు విమర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి దుయ్యబట్టారు. కోరుకొండ మండలంలో శనివారం సుడిగాలి పర్యటన చేవారు. బుచ్చెంపేటలో జక్కంపూడి గణేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర వద్దకు చేరుకుని, యాత్రలో పాల్గొన్న యువతను అభినందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి విలేకర్లతో మాట్లాడుతూ అమరావతి రాజధాని శంకుస్థాపనకు గంగానది నీరు. మట్టి తీసుకొచ్చినప్పుడు పొగిడిన చంద్రబాబు, ఇప్పుడు విమర్శించడం ఎంత వరకూ సబబన్నారు. అప్పుడెందుకు చెలిమికట్టారు, ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో బాబు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. యువనేస్తం పథకాన్ని కన్నీటితుడుపుగా నిర్వహించారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం మద్దతు ఉందని, పొత్తుల కోసం ఆరాటపడే నాయకుడు కాదని జక్కంపూడి అన్నారు. అలాగే జక్కంపూడి కుటుంబం ప్రజల సంక్షేమానికి అలుపెరగకుండా పొరాటం చేస్తుందన్నారు. అనంతరం గాదరాడలో ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. -
బట్టబయలైన ‘బాబు’ నైజం
సాక్షి, రాజమహేంద్రవరం: ఎన్నికల్లో ఓట్ల కోసమే తప్ప ప్రజలు, సామాజిక వర్గాల కోసం సీఎం చంద్రబాబు ఏ పనీ చేయడన్న విషయం సోమవారం రాష్ట్ర సచివాలయం వద్ద మరోమారు బయటపడిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు, రాజానగరం కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ వాస్తవంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాలయాల్లోని కేశ ఖండనశాలల్లో పని చేసే నాయి బ్రాహ్మణులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళితే వారిని నోటికొచ్చినట్లు మాట్లాడి భయపెట్టిన చంద్రబాబుకు బుద్ధిలేదని మండిపడ్డారు. ఈ ఘటనతో సామాన్యులు, శ్రామికుల పట్ల ఆయన బుద్ధి భేమిటో తేటతెల్లమవుతోందన్నారు. ఓటమి భయంతోనే అసహనం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు భారీగా ప్రజలు వచ్చి, సమస్యలు చెప్పుకుంటుండడంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందని విజయలక్ష్మి అన్నారు. 2014 ఎన్నికల్లో కులాల వారీగా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయని చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఈ వయస్సులో ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించి, ఆ తర్వాత తాను చెప్పినట్లు చేయకపోవడంతో అవమానకరంగా పదవి నుంచి దింపారని గుర్తు చేశారు. తిరుపతిలో చంద్రబాబు చేసిన ఘన కార్యాలను బయటపెట్టిన ప్రధానార్చకులు రమణను తొలగించారన్నారు. తనకు అనుకూలంగా, తన కుమారుడు లోకేష్‌కు ముడుపులు ఇచ్చే వారికే పదవులు, కాంట్రాక్టులు ఇస్తూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గోముఖవ్యాఘ్రం లాంటి వాడని విమర్శించారు. ‘మీకిది ఇస్తే నాకేం’టని ఆలోచించే చంద్రబాబు జీవితం అంతా అవినీతిమయమని ఆరోపించారు. -
చంద్రబాబు బుర్ర చెడింది..!
సీతానగరం (రాజానగరం): ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుర్ర చెడిపోయిందని, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఎద్దేవా చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆమె పర్యటించి తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కర్నాటకలో బీజేపీ అధిష్టానం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేయడాన్ని తప్పుబట్టారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేసిందేమిటని విజయలక్ష్మి ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి తాను దోచుకున్న సొమ్ముతో కొనుగోలు చేసి, మంత్రులను కూడా చేసిన ఘనతను చంద్రబాబు మరిచారా? అని ఆమె అన్నారు. జన్మభూమి కమిటీల మాటే శాసనంగా నాలుగేళ్లుగా అర్హులైన వారికి పింఛన్లు రద్దు చేసి, ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఇప్పుడు జన్మభూమి కమిటీలకు సంబంధం లేకుండా, అర్హులందరికీ పింఛన్లు ఇస్తామనడం ఓటర్లను మభ్య పెట్టేందుకే అన్నారు. జగన్‌కు ఘన స్వాగతం పలకడానికి జిల్లా ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని విజయలక్ష్మి అన్నారు. -
బలవంతపు భూసేకరణను నిరసిస్తూ ఆందోళన
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నంలో బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాధిత రైతులతో కలిసి అఖిలపక్ష పోరాటం చేపడతామని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు. బలవంతంగా భూములు తీసుకున్న రైతులతో కలిసి సీతానగరం బస్టాండ్ సెంటర్లో మంగళవారం ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా పోరాటం చేద్దామన్నారు. ఈ సందర్భంగా నార్త్‌జోన్ డీఎస్సీ ప్రసన్నకుమార్‌తో జక్కంపూడి చర్చించారు. రైతులకు పోలీసుల వేధింపులు లేకుండా చూడాలన్నారు. జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులతో సంప్రదించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం మధ్యాహ్న వరకూ మీరు రైతులకు అందించే న్యాయం కోసం చూస్తామని, గురువారం నుంచి రైతు కుటుంబాలతో కలిసి భూముల్లో ఉంటామని ఆమె స్పష్టం చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ రైతులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆమె డీఎస్పీకి సూచించారు. పై అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ బాధిత రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. భూములు తీసుకుంటున్నామంటూ మంగళవారం కూడా రెవెన్యూ అధికారులు రైతుల ఇళ్ల గోడలకు నోటీసులు అతికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్‌బాబు, వలవల రాజా, చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంట్రాజు, బాధిత రైతులు ఐఎస్ఎన్ రాజు, గద్దె రామకృష్ణ, కలగర్ల భాస్కరరావు, కలగల సర్వారాయుడు, కరుటూరి విజయ్‌కుమార్ చౌదరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'బాబు పాలనలో దళితులపై దాడులు పెరిగాయి'
రాజమహేంద్రవరం : 'దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు' అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్ని నిజం చేస్తూ గ్రామాల్లో దళితులపై దాడులు పెరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో జన్మభూమి కమిటీ సభ్యుల వేధింపులకు తాళలేక బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన దళితుడు యడ్ల చిన్నా(30) కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా చిన్నా కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు జన్మభూమి కమిటీ సభ్యులు తీర్మానించి, ఆ భూమిలో చెత్తను డంప్ చేయడంతో జీవనాధారం కోల్పోయిన చిన్నా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. చుట్టుపక్కల 12 ఎకరాల భూమి ఉండగా మధ్యలో ఉన్న దళితుడి భూమిలోనే ఎందుకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. చిన్నా కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, 2 ఎకరాల పొలం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి రూ.లక్ష నష్టపరిహారం ఇస్తామన్న సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ అనంతరం రూ.50 వేలు మాత్రమే ఇవ్వడంతో మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోనే ఉంచారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకూ మృతదేహాన్ని తరలించేంది లేదని విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
'చంద్రబాబుది దమన నీతి'
రాజమండ్రి (తూర్పుగోదావరి): చంద్రబాబుది దమన నీతి అని వైఎస్సార్సీపీ సీజీసీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29న చేపట్టిన రాష్ట్రబంద్‌ను అడ్డుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిందని, అలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ తూర్పారపట్టారు. -
వైఎస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి అరెస్ట్
-
పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తాం
రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ ఆరోపించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జక్కంపూడి విజయలక్ష్మీ మాట్లాడుతూ... మహిళనని కూడా చూడకుండా పోలీసులు అగౌరవంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రశాంతంగా బంద్ చేస్తున్న తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. -
బాబు పాలనలో పేదలకు అన్యాయం
కోరుకొండ :ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. అర్హులైన వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల నిలిపివేతకు నిరసనగా సోమవారం కోరుకొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కొన్నింటిని చంద్రబాబు రద్దు చేసి, మరికొన్నింటికి పేర్లు మారుస్తున్నారని విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన చంద్రబాబు నేటికీ ఏ ఒక్కదానిని అమలు చేయలేదని ఆరోపించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛన్లు కోల్పోయిన వారు చంద్రబాబు పాలనతో విసుగు చెందారన్నారు. డిసెంబర్ మొదటి వారంలో నిలిపివేసిన పింఛన్లు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇలాఉండగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పింఛన్ల కోసం గగ్గోలు పెట్టారు. ఇటీవల పింఛను కోల్పోయిన శ్రీరంగపట్నానికి చెందిన 90 ఏళ్ల మెల్లెం మరియమ్మను ఆమె బంధువులు మంచంపై తీసుకొచ్చి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ బొల్లిన సుధాకర్, బీసీ సెల్ మండల కన్వీనర్ సూరిశెట్టి భద్రం, మండల రైతు కన్వీనర్ తోరాటి శ్రీను, పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సొమ్మసిల్లిన వృద్ధురాలు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన 86 ఏళ్ల యర్రంశెట్టి మంగాయమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు జక్కంపూడి విజయలక్ష్మి మంచినీరు పట్టించారు. కోరుకొండ పీహెచ్సీ ఏఎన్ఎంలు ప్రాథమిక చికిత్స చేసి, ఆటోలో ఆస్పత్రికి తరలించారు. -
నెహ్రూకు నేతల పరామర్శ
కాకినాడ :అస్వస్థతతో బాధపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను ఆయన చికిత్స పొందుతున్న కాకినాడ సేఫ్ ఆస్పత్రిలో మంగళవారం వివిధ రాజకీయపక్షాల నేతలు పరామర్శించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వనమాడి కొండబాబు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, ఆకుల వీర్రాజు, మేడపాటి అనిల్‌రెడ్డి, నక్కా రాజబాబు, కిర్లంపూడి దత్తుడు, లింగం రవి తదితరులు ఆయనను పరామర్శించారు.