ఎంసెట్ పరీక్ష కేంద్రాల వద్ద జామర్లు: కన్వీనర్ | Jammers to be set up at EAMCET 2014 exam centres, says N.V. Ramana Rao | Sakshi
Sakshi News home page

ఎంసెట్ పరీక్ష కేంద్రాల వద్ద జామర్లు: కన్వీనర్

Published Thu, May 15 2014 11:11 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM

Jammers to be set up at EAMCET 2014 exam centres, says N.V. Ramana Rao

ఈ నెల 22న ఎంసెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్ష కన్వీనర్ రమణారావు వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో రమణారావు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ పరీక్షకు మొత్తం 3,95,555 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. మెడికల్ విభాగంలో 1,12,800 మంది విద్యార్థులు, ఇంజనీరింగ్ విభాగంలో 2,82,750 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేశారని చెప్పారు.

 

మెడికల్ విభాగంలో దాదాపు 300 మంది విద్యార్థులు చేసిన దరఖాస్తులపై పలు అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. సదరు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. పలు ప్రాంతాలలో ఎంసెట్ పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేంద్రాలలో జామర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు రమణారావు వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement