
ప్రభుత్వ పథకాలేవైనా.. వారికే దక్కాలి. సర్కారు అందించే అవకాశాలన్నీ... వారి అనుచరులకే దక్కాలి. ఇదీ పాలకపక్ష నాయకుల తీరు. అధికారంలోకి వచ్చింది లగాయతూ అదే ధ్యేయంతో పనిచేస్తున్నారు. తమకు అనుకూలంగా లేనివారికి పథకాలు వెళ్ల కూడదన్న భావనతో ప్రతి గ్రామంలో పార్టీ తరఫున జన్మభూమి కమిటీల పేరుతో రాజ్యాంగేతర శక్తులను నెలకొల్పి లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అప్పగించారు. దీనివల్ల అనర్హులకే అన్నీ దక్కుతున్నాయి. అన్ని అర్హతలున్నా... వారికి అనుకూలురు కాకుంటే మొండిచెయ్యి చూపుతున్నారు. తాజాగా ప్రభుత్వం అందించిన రైతురథం పథకానిదీ అదే దారి కావడం ఇప్పుడు
చర్చనీయాంశమైంది.
సాక్షిప్రతినిధి,విజయనగరం: కర్నూలు జిల్లా నంధ్యాలలో ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్కడి రైతులకు ప్రభుత్వం ‘రైతు రథం’ పథకం పేరుతో ట్రాక్టర్లను సరఫరా చేసిం ది. వైఎస్సార్ కడప జిల్లాలోనూ కొందరు రైతులకు ట్రాక్టర్లు ఇచ్చారు. కానీ విజయనగరంలో మాత్రం ఖరీఫ్ సీజన్ ముగిసినా ఇంకా అందజేయలేదు. ఈ లోగా ఈ పథ కం లబ్ధిదారుల జాబితాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని పరిశీలిస్తే తెలుగుదేశం అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుందో తేటతెల్లమవుతోంది. విజయనగరం జిల్లాకు 548 ట్రాక్ట ర్లు కేటాయించారు. జిల్లాలో 34 మండలాలున్నాయి. మండలానికి 15నుంచి 16 చొప్పున కేటాయించారు. 4డబ్ల్యూడీ ట్రాక్టర్‌కు రూ.2 లక్షలు, 2 డబ్ల్యూడీ ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షలు చొప్పన రాయితీ ఇవ్వనున్నారు. అధికార పార్టీనేతల సిఫార్సులు ఉన్న వారికే ట్రాక్టర్లిస్తామని మెలిక పెడుతున్నారు. అంటే అర్హతలున్నా తమకు ట్రాక్టర్ రాదని తెలిసి చాలా మంది రైతులు దరఖాస్తు చేయడానికి కూడా ముందుకు రాలేదు.
ఇన్‌చార్జి మంత్రి ఆమోదానికి ప్రతిపాదనలు
జిల్లాలో ట్రాక్టర్లకోసం 612 మంది దరఖాస్తు చేశారు. 15 మంది ట్రాక్టర్ల కోసం డీడీలు తీశారు. ఇప్పటి వరకు 59 మందికి మంజూరు చేసినా ఇప్పటికి ఒక్కరికైనా ట్రాక్టర్ పంపిణీ చేయలేదు. జిల్లాకు కేటాయించిన మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు ఎంపిక చేసిన జాబితాలు వ్యవసాయ శాఖకు అందాయి. దానిని ఇన్‌చార్జ్ మంత్రికి పంపిస్తే ఆయన తుది అనుమతులు ఇస్తారట. ఇలా జిల్లా నుంచి వెళ్లిన లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారంతా మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఉండటమే విశేషం. చిన్న సన్నకారు రైతులకు అందాల్సిన ట్రాక్టర్లను పదవులు అనుభవిస్తున్న వారికి, తమ పార్టీ వారికే కట్టబెడుతూ రైతులకు మేలు చేస్తున్నట్లు టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.
ఇవీ నిబంధనలు:
రైతు రథం పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుకు కనీసం రెండు ఎకరాలు పొలం ఉండాలి
గతంలో రాయితీపై ట్రాక్టర్ తీసుకుని ఉండకూడదు.
దరఖాస్తుదారుడి పేరుమీద ఇప్పటికే ట్రాక్టర్ ఉండకూడదు. ∙అధార్, పాస్ బుక్‌లను చూపించి మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి.
∙దరఖాస్తు సమయంలో రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ∙వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు.
జిల్లాలో ఇప్పటి వరకూ రైతు రథం కోసం ఎంపికైన లబ్ధిదారుల జాబితాలో టీడీపీ వర్గీయులు:
చీపురుపల్లి నియోజకవర్గం: ∙గరివిడి మండలం కుమరాం ఎంపీటీసీ సభ్యుడు గొర్లెరమేష్(శ్రీను) సోదరి వాలిపల్లి సన్యాసమ్మ, శేరీపేట గ్రామ సర్పంచ్ పిళ్ల కృష్ణవేణి, దుమ్మెద ఎంపీటీసీ సభ్యురాలైన సూరీడమ్మ తోడికోడలు యజ్జపురపు జయలక్ష్మి, కోడూరు టీడీపీ కార్యకర్త గవిడి మహాలకు‡్ష్మనాయుడు, కొండలక్ష్మీపురం ఎంపీటీసీ సభ్యురాలు శనపతి లక్ష్మి సోదరుడు శనపతి ఆదినారాయణ, కె.పాలవలస టీడీపీ నాయకుడు మీసాల రామునాయుడు, వెదుళ్లవలస ఎంపీటీసీ సభ్యుడు నడుపూరి అప్పలనాయుడు, మందిరవలస కార్యకర్త సాకేటి సూర్యనారాయణరావు, శివరాం ఎంపీటీసీకి బంధువైన గవిడి కామమ్మ, ఎం.దుగ్గివలస కార్యకర్త కలిశెట్టి శ్రీరాములు, కందిపేట టీడీపీ నాయకురాలు మీసాల విజయ సోదరుడు కంది పెంటన్నాయుడు, తాటిగూడ ఎంపీటీసీ శనపతి సన్యాసి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బలగం వెంకటరావు తల్లి బలగం సూరమ్మ ఉన్నారు.
మెరకముడిదాం మండలానికి సంబంధించి మెరకముడిదాం ఎంపీటీసీ పేరిచర్ల బంగార్రాజు, సోమలింగాపురం టీడీపీ నేత బి.తమ్మారావు, ఉత్తరావల్లి మాజీ సర్పంచ్ ఎం.రమణమోహన్, రామాయవలస ఎంపీటీసీ గొర్లెఅప్పలస్వామి, యాడిక ఎంపీటీసీ జమ్ము శంకరరావు, భైరిపురం నాయకుడు కెంగువనర్సింహమూర్తి, ఇప్పలవలస మాజీ సర్పంచ్ రౌతుఆనంద్, భగీరథిపురం సర్పంచ్ చోడవరపు బంగారునాయుడు, బిల్లలవలస సర్పంచ్ భర్త తిరుమలరాజు సుబ్బరాజు, ఎంపీపీ సన్యాసినాయుడు మామ పల్లెడ సత్యం ఉన్నారు.
శృంగవరపుకోట నియోజకవర్గం...
∙శృంగవరపుకోట మండలం వేములాపల్లి మాజీ సర్పంచ్ లగుడు వెంకటరావు, చినఖండేపల్లి నాయకుడు మేడపురెడ్డి శ్రీను, కొట్టాం సర్పంచ్ తెరపల్లి సూరిబాబు, తిమిడి సర్పంచ్ రవికుమార్‌కు అనుచరుడైన గండి అప్పలనాయుడు ఉన్నారు.
కురుపాం నియోజకవర్గం...
∙కురుపాం మండలం ఉదయపురం సర్పంచ్ బిడ్డిక జాంబిరి భర్త రామారావు, మరిపిల్లి సర్పంచ్ బిడ్డిక సుక్కు తండ్రి బిడ్డిక మంగి, మొండెంకల్ మాజీ సర్పంచ్ గుడారి లక్ష్మి ఉన్నారు.
∙గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడ సర్పంచ్ తాడంగి రాధ, గుమ్మలక్ష్మీపురం మండల కన్వీనర్ పాడి సుధ, గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ భర్త తాడంగి లక్ష్మణ రావు ఉన్నారు. ∙జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ సర్పంచ్ ముప్పర్తి లక్ష్మి, జోగులడుమ్మ సర్పంచ్ విజయమ్మ భర్త శివ్వాల తవిటినాయుడు, వాడ సర్పంచ్ బంకురు ఉషారాణి ఉన్నారు.∙గరుగుబిల్లి మండలం ఎంపీపీ కాళీ ప్రసాద్‌కు సలహాదారులైన పెద్దూరుకు చెందిన మర్రాపు శ్రీనివాసరావు, మర్రాపు చింతాలమ్మకు మంజూరు చేశారు.∙కొమరాడ మండలం కొమరాడ ఎంపీటీసీ బొడ్డుకుమారి ఉన్నారు.
ఇన్‌చార్జ్ మంత్రి అనుమతిస్తేనే...
రైతు రథం పథకం కింద ఇప్పటి వరకు 612 దరఖాస్తులు వచ్చాయి. 59 ట్రాక్టర్లకు ఇన్‌చార్జ్ మంత్రి అమోదం తెలిపారు. వాటిని పంపిణీ చేయాల్సి ఉంది. మిగతా వాటిని పరిశీలిస్తున్నాం. పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఆమోదంకోసం ఇన్‌చార్జ్ మంత్రి వద్దకు తీసుకుని వెళతాం. ఆయన సూచించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాం.
–జి.ఎస్.ఎన్.లీలావతి, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్, విజయనగరం.
Comments
Please login to add a commentAdd a comment