భారవికి కాళోజీ పురస్కారం | jk bharavi get kaloji narayana rao puraskar | Sakshi
Sakshi News home page

భారవికి కాళోజీ పురస్కారం

Published Wed, Sep 10 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

భారవికి కాళోజీ పురస్కారం

భారవికి కాళోజీ పురస్కారం

హైదరాబాద్: తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గొప్ప దార్శనికుడని, దమ్మున్న ప్రజాకవి అని పలువురు ప్రముఖులు కొనియాడారు. కాళోజీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఆధ్వర్యంలో సినీ రచయిత జె.కె.భారవికి కాళోజీ స్మారక పురస్కారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అవధాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు మాడుగుల నాగఫణిశర్మ, సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞశర్మ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement