కడప అగ్రికల్చర్ : కడప డివిజన్ పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్వరరెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసుశాఖ నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి.
కడప అగ్రికల్చర్ : కడప డివిజన్ పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్వరరెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసుశాఖ నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఆయన స్థానంలో చింతపల్లిలో పనిచేస్తున్న అశోక్‌కుమార్ కడప డీఎస్పీగా బదిలీపై రానున్నారు. 2012వ సంవత్సరం చివరి నుంచి ఇప్పటివరకు రాజేశ్వరరెడ్డి కడప డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.
పలువురు సీఐలకు పదోన్నతులు
కడపలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. ఇందులో కడపఅర్బన్ సీఐగా పనిచేస్తున్న శ్రీనివాసులు కడప ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీగా బదిలీ అయ్యారు. కడపవన్‌టౌన్ సీఐగా పనిచేస్తున్న మహబూబ్‌బాషను తిరుపతి మహిళా స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు. అలాగే కడప రూరల్ సీఐగా పనిచేస్తున్న రాజగోపాల్‌రెడ్డిని కడప ఎస్‌బీఐ డీఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.