
సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు
హైదరాబాద్ : సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడుగా ఆపార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యుడు కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గురువారం హరిబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన ఆయన 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న కీలక నేత. 1999 ఎన్నికల్లో విశాఖ-1 ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా సీమాంధ్రకు హరిబాబు నియాకంతో ... ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా కొనసాగించవచ్చని సమాచారం.