ముఖ్యమంత్రి డబ్బులిచ్చి, రెచ్చగొట్టేవారిని ప్రోత్సహిస్తున్నారని ఎంపీ వివేక్ ఆరోపించారు. తన ప్రకటనలతో ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనే ముందుగా పీడీ యాక్ట్ పెట్టాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని వెంటనే ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకుండా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, డీజీపీ దినేశ్ రెడ్డిలే ప్రధానంగా అడ్డుపడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఏపీ ఎన్జీవోలు నిర్వహిస్తున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు దీటుగా తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే బంద్ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు, శనివారం నాటి తెలంగాణా బంద్ విషయంలో బీజేపీలో చీలిక ఏర్పడింది. బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం, వద్దని మరో వర్గం పరస్పరం వాదించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక బీజేపీ నాయకులు సతమతం అవుతున్నారు.
ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి: ఎంపీ వివేక్ డిమాండ్
Published Fri, Sep 6 2013 7:34 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement