అనంతపురం జిల్లా రొద్దం మండలం నల్లూరులో కుల వివక్ష బయటపడింది.
అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం నల్లూరులో కుల వివక్ష బయటపడింది. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సమక్షంలో ఈ ఘటన జరిగింది. నల్లూరులో సోమవారం సీతారామాంజనేయ ఆలయం ప్రారంభోత్సవం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా దళితులు ఆలయంలోకి ప్రవేశించానుకున్నారు. కానీ అక్కడి గ్రామస్తులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు.
ప్రజా ప్రతినిధి అయి ఉండి కుల వివక్షను ఎందుకు అడ్డుకోలేకపోయారని దళితులు మండిపడ్డారు. ఓటు వేసినపుడు దళితులు కనిపించరా ? అని ప్రశ్నించారు. దీనిపై పార్థసారథి మౌనం వహించారు తప్ప సమస్యను పరిష్కరించలేకపోయారు.