
విజయనగరం రూరల్: విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాలలో 2018– 19 సంవత్సరానికి గాను ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి గత నెల 7వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు.
ఈ ఫలితాలను www. sainikschoolkorukonda. org వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు పాఠశాల ప్రిన్సిపాల్ కల్నల్ రుద్రాక్ష అత్రి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు ఇంటర్యూలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులకు కాల్‌లెటర్ పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 08922–246119, 246168 నంబర్లను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment