
సాక్షి, నెల్లూరు : లాక్‌డౌన్‌తో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భోజనం కోసం పేదలు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. గుండ్లపాలెం, కొత్తూరు గ్రామాల్లో ఆయన పేదలకు కూరగాయాలు, నిత్యావసరాలు, కోడిగుడ్లు, శానిటైజర్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయించారు. ఎవరైనా దాతలు తమ సహాయాన్ని సచివాలయాల్లో అందిస్తే, అవసరం ఉన్నవారికి వాలంటీర్లు అందిస్తారన్నారు. దీని వల్ల నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని కోటంరెడ్డి అన్నారు.