7న శ్రీశైలంలో కుంభోత్సవం | kumbothsavam in sreeshailam on 7th | Sakshi
Sakshi News home page

7న శ్రీశైలంలో కుంభోత్సవం

Published Sun, Apr 5 2015 8:20 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

kumbothsavam in sreeshailam on 7th

కర్నూలు: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబాదేవికి మంగళవారం వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత అమ్మవారికి సాత్విక బలి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశిని సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం శ్రీ మల్లికార్జునస్వామివారికి ప్రదోషకాల పూజలు నిర్వహించిన అనంతరం అన్నాభిషేకంతో లింగాన్ని కప్పివేసి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. సాయంత్రం స్వామివారి దర్శనం ఉండదు.

 

అమ్మవారి ఆలయంలో సింహమండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. సాంప్రదాయానుసారం స్త్రీ వేషంలోని పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనార్థం భక్తులను అనుమతిస్తారు. కుంభోత్సవం సందర్భంగా క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులను నిషేధించినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. ఎవరైనా ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మూడు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు దేవాదాయ చట్ట ప్రకారం జరిమానా విధించబడుతుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement