మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.60 కోట్లు | kurnool mallanna hundy income 1.60 crores | Sakshi
Sakshi News home page

మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.60 కోట్లు

Published Fri, Nov 13 2015 6:56 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM

kurnool mallanna hundy income 1.60 crores

శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబామల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాలలో భక్తులు హుండీలలో రూ. 1,60,47,909  కానుకలుగా లభించాయి. శుక్రవారం కల్యాణమండపంలో అధికారులు, సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు.

నగదుతో పాటు 210 గ్రాముల బంగారు, 2 కేజీల430 గ్రాముల వెండి వచ్చిందన్నారు. అలాగే విదేశీ కరెన్సీ అయిన 22 యూఏఈ దిర్హమ్స్, 53 యూఎస్‌ఏ డాలర్లు, 12 సింగపూర్ డాలర్లు, 10 ఈజిప్ట్ పౌండ్లు, 5 యూకే పౌండ్లు, 5 జపాన్ యువాన్స్, 2 మలేషియా రింగిట్స్, 2 ఖతార్ రియాల్స్, 2 సౌదీ రియాల్స్, ఒక ఒమన్ రియల్ వచ్చాయి. ఈ మొత్తం 38 రోజులకు ఈ ఆదాయం వచ్చిందని ఈఓ సాగర్‌బాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement